Budget 2024: ఏపీ బడ్జెట్ సమావేశాలు.. ప్రాధాన్యత వీటికే ..
ABN, Publish Date - Nov 11 , 2024 | 08:25 AM
అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌ను ఏపీ అసెంబ్లీలో ఇవాళ(సోమవారం) ఆర్థిక శాఖ మంత్రి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. సూపర్6 పథకాలతో పాటు కీలక ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అమరావతి: ఏపీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెలాఖరుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు సమయం ముగుస్తుండటంతో మిగిలిన కాలానికి బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.ఈరోజు ఉదయం 9 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఏపీ బడ్జెట్‌కు లాంఛనంగా అమోద ముద్ర వేసిన తర్వాత అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి కూడా వ్యవసాయ బడ్జెట్‌ను విడిగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అనంతరం అసెంబ్లీలో చర్చించే కీలక అంశాలపై చర్చించనున్నారు. జగన్ పాలనలో అడ్డగోలుగా ప్రభుత్వ ఆస్తులను విక్రయించారు. దీంతో వ్యవస్థలను గాడిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ ఆదాయాన్ని పెంచేందుకు బడ్జెట్‌లో మూలధన వ్యయం కింద రూ. 30 వేల కోట్లు కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. కూటమి సర్కార్ చిట్టా పద్దుల్లో రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇప్పటికే గుంతల పూడ్చడానికి రూ. 810 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
ఈ బడ్జెట్‌లో అధిక భాగం నిధులను కేటాయించే అవకాశం ఉంది. మరోవైపు సూపర్ 6 పథకాలకు సంబంధించి తల్లికి వందనం కార్యక్రమానికి రూ. 6 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ పథకానికి నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఉచిత బస్సు విషయాన్ని బడ్జెట్‌లో ప్రస్తావించడంతో కేటాయింపులు జరిపే అవకాశం ఉంది. అలాగే ఇరిగేషన్ శాఖకు రూ. 10 వేల నుంచి రూ. 11 వేల కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం. రూ. 18 వేల కోట్లను కేటాయించాలని విద్యుత్ శాఖ కోరగా ఆ మొత్తాన్ని బడ్జెట్‌లో చూపించే అవకాశం ఉంది. వ్యవసాయ బడ్జెట్‌కు ఈ సారి అత్యంత ప్రాధాన్యం ఉండనుంది. జగన్ హయాంలో చేసిన ఆర్థిక విధ్వంసాన్ని గాడిలో పెట్టి ఈరోజు పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఇదిలా ఉంటే వరుసగా రెండు సార్లు ఓటాన్ అకౌంట్ అసెంబ్లీలో పెట్టిన చర్రిత ఏన్నాడూ లేదు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Nov 11 , 2024 | 08:26 AM