Home » AP CM
రాష్ట్రాన్ని విభజించి పదేళ్లు పూర్తయింది. సర్వం కోల్పోయిన అవశేష ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా నిలబెట్టేందుకు కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు కాలేదు.
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ మొదలైంది. నైరుతి రుతుపవనాల విస్తరణ వేగంగా సాగుతోంది. రెండు, మూడు రోజుల్లో రాయలసీమకు వచ్చి, అతికొద్ది రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నాయి. వర్షాలు విస్తారంగా కురిస్తే పంటల సాగు ప్రారంభం కానున్నది.
మొన్నటి దాకా వలంటీర్లంతా తమ వారేనన్నారు. పార్టీ కోసం అడ్డగోలుగా వాడుకున్నారు. ఎన్నికల ముందు చాలామందితో రాజీనామా చేయించి మరీ ప్రచారం చేయించుకున్నారు. అవసరం తీరిపోవడంతో ఇప్పుడు వైసీపీ నేతలు మొహం చాటేస్తున్నారు. పాపం... వలంటీర్లు పావులుగా మారిపోయారు
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సేవలను ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన ఎంతో దార్శనికత గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.
ఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయి పదేళ్లు కావస్తోంది. ఇప్పటికీ రాష్ట్రాన్ని విభజన కష్టాలు వెంటాడుతున్నాయి. విభజన అనంతరం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడితప్పింది.
రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయిస్తున్న రైతులను జగన్ సర్కారు ఎప్పటికప్పుడు నిండా ముంచేస్తోంది. ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యాయి
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌కు సరిగ్గా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. అన్ని పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం. గెలిచేదెవరు.. ఓడేదెవరు.. చర్చంతా ఇదే. ఈ సమయంలో సోషల్ మీడియాలో కొన్ని సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. దాదాపు ఓ 10 నివేదికలు పలు సర్వే సంస్థల పేర్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఏ ఫలితం చూసినా ఒకేలా ఉండటంతో రాజకీయ పార్టీల్లో వణుకు మొదలైనట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. మేజిక్ ఫిగర్‌కు అవసరమైన సీట్లను సాధించడానికి రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతోంది. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువుగా ఉండటంతో వైసీపీ నేతలు ఒకింత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర తర్వాత కూడా నియోజకవర్గాల్లోని పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా లేవనే సంకేతాలు వెలువడటంతో ఇక చివరి అస్త్రాన్ని ప్రయోగించాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల రాజీనామా అంటూ గత కొద్దిరోజులుగా ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి. జగన్‌పై అభిమానంతో వైసీపీకి మద్దతుగా వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు విపక్షాల కారణంగా తమ వాలంటీర్ పోస్టు పోయిందని, ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే మళ్లీ తమ ఉద్యోగం వస్తుందంటూ ఇంటింటికి వెళ్లి వైసీపీ తరపున వాలంటీర్లు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తద్వారా సానుభూతితో ఓట్లు వేయించుకునేందుకు వాలంటీర్లకు తెలియకుండానే వైసీపీ ఓ పెద్ద ప్లాన్‌కు తెరలేపింది.
ఏపీలో వరుసగా రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర చేస్తున్నారు. ఈ బస్సుయాత్రకు ప్రజల నుంచి పెద్దగా ఆదరణ లేదనే చర్చ కొన్ని రోజులుగా నడుస్తోంది. ఈ బస్సుయాత్రకు, జగన్ సభలకు జనాన్ని బలవంతంగా తరలిస్తున్నారనే ప్రచారం ఉంది. వైసీపీ శ్రేణులు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తూ వచ్చారు. జగన్‌ను మరోసారి సీఎంను చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారంటూ కవరింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు.