Share News

AP Elections: వైసీపీ చివరి అస్త్రం ఇదే.. పైసలపైనే జగనన్న నమ్మకం..

ABN , Publish Date - Apr 29 , 2024 | 09:52 AM

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. మేజిక్ ఫిగర్‌కు అవసరమైన సీట్లను సాధించడానికి రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతోంది. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువుగా ఉండటంతో వైసీపీ నేతలు ఒకింత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర తర్వాత కూడా నియోజకవర్గాల్లోని పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా లేవనే సంకేతాలు వెలువడటంతో ఇక చివరి అస్త్రాన్ని ప్రయోగించాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

AP Elections: వైసీపీ చివరి అస్త్రం ఇదే.. పైసలపైనే జగనన్న నమ్మకం..
YSRCP

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. మేజిక్ ఫిగర్‌కు అవసరమైన సీట్లను సాధించడానికి రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతోంది. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువుగా ఉండటంతో వైసీపీ నేతలు ఒకింత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర తర్వాత కూడా నియోజకవర్గాల్లోని పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా లేవనే సంకేతాలు వెలువడటంతో ఇక చివరి అస్త్రాన్ని ప్రయోగించాలని వైసీపీ నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది.


ఇప్పటివరకు విపక్ష కూటమిపై అసత్య ఆరోపణలతో ప్రజల మైండ్‌సెట్ మార్చాలనే ప్రయత్నం ఫలించకపోవడం, మరోవైపు జగన్‌పై రాయి దాడి ఘటన ద్వారా ప్రజల్లో సానుభూతి సంపాదించాలనే వ్యూహం వర్కౌట్ కాకపోవడంతో పైసలతో గెలవాలనే కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. హోరాహోరీ పోటీ నడుస్తున్న నియోజకవర్గాల్లో ఫలితాలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు డబ్బులు పంపిణీ చేయాలని వైసీపీ అధిష్టానం పార్టీ శ్రేణులకు ఆదేశించినట్లు తెలుస్తోంది.


ఓవైపు మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం సత్ఫలితాలివ్వకపోవడంతో.. ఇక జగనన్న పైసలనే నమ్ముకున్నారనే ప్రచారం జరుగుతోంది. పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చుపెట్టినా వైసీపీ మేజిక్ ఫిగర్‌ను చేరుకోవడం అసాధ్యమని ఆ పార్టీ నేతలే ఓ అంచనాకు వచ్చారట. అయితే కనీసం పరువు నిలుపుకునే స్థాయిలో సీట్లు సాధించడంపైనే జగన్ దృష్టిపెట్టారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

దటి జ్ జగన్...


టార్గెట్ 50..

వైనాట్ 175 నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వైసీపీ అధినేత జగన్.. ప్రస్తుతం 50 సీట్లలో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. 2019 ఎన్నికల్లో 4రాయలసీమల జిల్లాల్లోని 52 నియోజకవర్గాల్లో 49 సీట్లును వైసీపీ గెలుచుకుంది. టీడీపీ కేవలం 3చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి రాయలసీమ జిల్లాల్లో భారీగా సీట్లు సాధించే అవకాశం ఉందని సర్వేలు వెల్లడించడంతో వైసీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుంది. వాస్తవానికి గత ఎన్నికల్లో సాధించినట్లు 49 కాకపోయినా.. కనీసం 40 సీట్లు సాధించాలని భావించిన వైసీపీ ప్రస్తుత పరిస్థితులు చూసి కంగుతిన్నట్లు తెలుస్తోంది. 52 సీట్లలో 20 నుంచి 30 సీట్లలో గెలవాలని టార్గెట్‌గా పెట్టుకుందట. ఉమ్మడి కడప జిల్లాలో 8 నుంచి 9, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 15 నుంచి 25 సీట్లను టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కోస్తాంధ్రాలో మరో 30 సీట్ల వరకు గెలిస్తే పార్టీ పరువు కాపాడుకోవచ్చనే అంచనాకు వైసీపీ నేతలు వచ్చారంట. దీనిలో భాగంగా ఆఖరి అస్త్రంగా డబ్బు పంపిణీని వైసీపీ నేతలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి.

పొ పోరా శ్రీమంతుడా


పిఠాపురంలో

ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో మత్య్సకారులను టార్గెట్ చేసిన వైసీపీ.. ఒక్కో రేషన్ కార్డుకు రూ.1500 చొప్పున పంచినట్లు తెలుస్తోంది. పోలింగ్ సమయంలో మరికొంత ఇస్తామని.. మీరంతా వైసీపీకే ఓటు వేయాలని పిఠాపురం నియోజకవర్గంలోని ఓటర్లను ప్రలోభపెడుతున్నట్లు సమాచారం. పవన్‌కళ్యాణ్‌ను ఓడించాలనే లక్ష్యంతో వందల కోట్లను ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టేందుకు వైసీపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. పైసలతోనైనా గెలవాలని వైసీపీ పోలింగ్‌కు 15 రోజుల ముందే ఆఖరి అస్త్రాన్ని ప్రయోగిస్తుందనే చర్చ నడుస్తోంది. ఓటర్లు వైసీపీ ప్రలోభాలకు లొంగుతారా.. పైసల ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది జూన్4న తేలిపోనుంది.


కుల చిచ్చుకు జగన్‌ కుట్ర

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Apr 29 , 2024 | 09:52 AM