AP Elections: జగన్ గాలి తీసేసిన యువత.. ఆ సీన్ చూసి వైసీపీ మైండ్ బ్లాంక్
ABN , Publish Date - Apr 20 , 2024 | 12:52 PM
ఏపీలో వరుసగా రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర చేస్తున్నారు. ఈ బస్సుయాత్రకు ప్రజల నుంచి పెద్దగా ఆదరణ లేదనే చర్చ కొన్ని రోజులుగా నడుస్తోంది. ఈ బస్సుయాత్రకు, జగన్ సభలకు జనాన్ని బలవంతంగా తరలిస్తున్నారనే ప్రచారం ఉంది. వైసీపీ శ్రేణులు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తూ వచ్చారు. జగన్‌ను మరోసారి సీఎంను చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారంటూ కవరింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు.
ఏపీలో వరుసగా రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర చేస్తున్నారు. ఈ బస్సుయాత్రకు ప్రజల నుంచి పెద్దగా ఆదరణ లేదనే చర్చ కొన్ని రోజులుగా నడుస్తోంది. ఈ బస్సుయాత్రకు, జగన్ సభలకు జనాన్ని బలవంతంగా తరలిస్తున్నారనే ప్రచారం ఉంది. వైసీపీ శ్రేణులు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తూ వచ్చారు. జగన్‌ను మరోసారి సీఎంను చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారంటూ కవరింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రజలను ఎంత మభ్యపెట్టాలని చూసినా.. నిజం నిలకడగా బయటకు వస్తుందనే నానుడిని నిజం చేస్తూ.. జగన్ బస్సుయాత్రకు జనాన్ని ఎలా తరలిస్తున్నారో.. కాకినాడ వేదికగా రాష్ట్రప్రజలకు తెలిసిపోయింది. దీంతో వైసీపీ నాయకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
జగన్ బస్సుయాత్ర వస్తున్న ప్రాంతంలో జనం పెద్దగా కనిపించడంలేదు. అతికష్టంమీద సాయంత్రం వేళ జరిగే సభలకు జనాన్ని తరలించేందుకు స్థానిక నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బస్సుయాత్రలో జనం లేకపోతే ప్రజలకు నెగిటివ్ మెసేజ్ వెళ్తుందనే ఉద్దేశంతో బస్సు యాత్ర వెళ్తున్న మార్గంలో కొన్నిచోట్ల భారీగా జనాన్ని సమీకరించి జగన్‌ను కలిసేందుకు స్థానిక నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా కాకినాడలో యాత్ర ప్రవేశించడంతో సూరంపల్లి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులను జగన్ బస్సు యాత్రకు తరలించారు. ఇష్టం లేదని విద్యార్థులు మొత్తుకున్నా.. యాజమాన్యం బలవంతంగా అటెండెన్స్ వేయమంటూ బెదిరించి జగన్ బస్సు యాత్ర వద్దకు విద్యార్థులను తరలించింది. తీరా వచ్చిన తర్వాత విద్యార్థులు తమ మనసులో మాటను బయటపెట్టేశారు. ఇక్కడకు వచ్చినవాళ్లంతా జగన్‌పై అభిమానంతో రాలేదని, అటెండెన్స్ వేయమని బెదిరించి తమ కళాశాల సిబ్బంది తీసుకొచ్చారని ఓ విద్యార్థి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో జగన్ బస్సు యాత్ర ఎంత పేలవంగా జరుగుతుందో రాష్ట్రప్రజలకు తెలిసివచ్చింది.
Kanakamedala Ravindra Kumar: అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టికి చంద్రబాబు ఒక బ్రాండ్...
పవన్ కళ్యాణ్ నినాదాలు
జగన్ బస్సు యాత్రలో పాల్గొన్న విద్యార్థులు జగన్ ఎదురుగా బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో అక్కడున్న వైసీపీ శ్రేణులంతా షాక్ అయ్యారు. జగన్ సైతం తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. ఇష్టం లేకుండా బలవంతంగా తరలిస్తే ఎలా ఉంటుందో వైసీపీ నాయకులకు అప్పుడు తెలిసి వచ్చిందట. జగన్ ఎదురుగానే పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో యూత్ చూపించారట. దీంతో వైసీపీ నాయకులంతా ఒక్కసారిగా షాక్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు కాకినాడ సమీపంలోని పిఠాపురం నియోజకవర్గంలో స్వయంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా వంగా గీత పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలవరంటూ వైసీపీ నాయకులంతా ప్రచారం చేస్తున్నారు. కాకినాడలో సీన్ చూసిన తర్వాత జగన్ అండ్ కో దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిందనే ప్రచారం జరుగుతోంది.
మొత్తానికి జగన్‌పై ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారనేది కాకినాడ జగన్ బస్సుయాత్రలో స్పష్టమైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల నాటికి ఈ వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. బలవంతంగా జనాన్ని తరలించి చేస్తున్న జగన్ బస్సు యాత్ర ఆ పార్టీకి ఎలాంటి ఫలితాలు తెస్తుందనేది జూన్4న తేలనుంది.
Chandrababu: ట్విటర్ ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్ డే చంద్రబాబు హ్యాష్ ట్యాగ్..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..