Home » AP Congress
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ( YS Jaganmohan Reddy) ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘సిగ్గు సిగ్గు... జగన్! ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతానని అనడం మీ అజ్ఞానానికి నిదర్శనం’ అంటూ షర్మిల విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) తీరుపై ఏపీ కాంగ్రెస్ పార్టీ(AP Congress Party) ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలను జగన్ గాలికి వదిలేశారంటూ మండిపడింది. ఇటీవల కురిసిన వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులను ఆయన కనీసం పట్టించుకోలేదని ధ్వజమెత్తింది.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరోసారి సెటైర్లు గుప్పించారు. వినుకొండ హత్య కేసుపై న్యూట్రల్ మీడియా వారిని తాము అడిగామని.. అలాగే తాము కూడా విచారించామని రషీద్‌తో పాటు చంపిన నిందితుడు కూడా వైసీపీ వాళ్లేనని తేలిందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. నేటి కేంద్ర బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టో అనడం కరెక్ట్ అని విమర్శించారు.
పచ్చ కామెర్లోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలా వైసీపీ (YSRCP) నేతల తీరు ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తెలుగుదేశం పార్టీకి కొమ్ముగాయలేదని APCC సీనియర్ నేత మస్తాన్ వలి (Mastan Vali) అన్నారు. తల్లికి వందనం పథకం మీద అధ్యక్షురాలిగా కూటమి సర్కార్‌ను ప్రశ్నించారని గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) 75వ జయంతి వేడుకలు ఈనెల 8న ఘనంగా నిర్వహించనున్నారు. మంగళగిరి సీకే(CK) కన్వెన్షన్ సెంటర్లో జరిగే కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకకు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరుకానున్నారు.
పోలవరం ప్రాజెక్ట్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) షాకింగ్ కామెంట్స్ చేశారు. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లుగా పోలవరం విధ్వంసానికి అసలు కారకులు బీజేపీ, టీడీపీ ,వైసీపీ పార్టీలే కారణమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ(AP Congress Party)లో వివాదం రోజురోజుకి ముదురుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధిష్ఠానం నుంచి వచ్చిన నిధుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా(Sharmila), ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ అవినీతికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ పద్మశ్రీ, రాకేశ్ రెడ్డి ఆరోపణలు చేశారు.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల (Sharmila) నాయకత్వంపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కె .సి .వేణుగోపాల్‌కి ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు సుంకరపద్మశ్రీ, రాకేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తాజాగా జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల ఎన్నిక పారదర్శకంగా జరుగలేదని ఆరోపించారు.