Sharmila: అన్నా నిన్ను మ్యూజియంలో పెట్టాలి.. జగన్‌పై షర్మిల విసుర్లు | Sharmila fires on Jagan VK
Share News

Sharmila: అన్నా నిన్ను మ్యూజియంలో పెట్టాలి.. జగన్‌పై షర్మిల విసుర్లు

ABN , Publish Date - Jul 29 , 2024 | 03:38 PM

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌ రెడ్డిపై ( YS Jaganmohan Reddy) ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘సిగ్గు సిగ్గు... జగన్‌! ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతానని అనడం మీ అజ్ఞానానికి నిదర్శనం’ అంటూ షర్మిల విమర్శించారు.

Sharmila: అన్నా నిన్ను మ్యూజియంలో పెట్టాలి.. జగన్‌పై షర్మిల విసుర్లు

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌ రెడ్డిపై (
YS Jaganmohan Reddy)
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘సిగ్గు సిగ్గు... జగన్‌! ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతానని అనడం మీ అజ్ఞానానికి నిదర్శనం’ అంటూ షర్మిల విమర్శించారు. అసెంబ్లీకి రాకపోవడాన్ని మించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా కనపడదని ఎద్దేవా చేశారు. ‘మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు జగన్‌. కానీ మిమ్మల్ని ఎన్నుకుని, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది’ అని షర్మిల ఆక్షేపించారు. సోమవారం నాడు ట్విట్టర్(X) వేదికగా షర్మిల స్పందించారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Also Read: CPI Ramakrishna: అమరావతికి కేంద్రం ఇచ్చే రూ.15వేల కోట్లు గ్రాంట్‌గా మార్చాలి..

వైఎస్సార్‌కి అవమానం జరిగేది కాదు..

‘‘జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీయండి అంటే మీకు నేను చంద్రబాబుకు కొమ్ము కాసినట్లు ఉందా..? మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి. అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే.. మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. అద్దంలో మీకు ఇప్పుడు కూడా చంద్రబాబే కనపడబడుతున్నారు. సోషల్ మీడియాలో నన్ను కించపరిచేంత ద్వేషం మీకు ఉంది .. మాకు ద్వేషం లేదు. కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉంది. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా..? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకు ఉంది. అది అధికార పార్టీనా.. లేక ప్రతిపక్షమా..? అన్నది ముఖ్యం కాదు. జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు! కాబట్టే తప్పు అన్నాం! చట్ట సభను గౌరవించకపోవడం తప్పు! కాబట్టే రాజీనామా చేయమన్నాం! వైఎస్సార్ విగ్రహాలు కూల్చేస్తే నేనే స్వయంగా అక్కడికి వచ్చి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలను హెచ్చరించా. అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈ రోజు వైఎస్సార్‌కి ఇంత అవమానం జరిగి ఉండేది కాదు’’ అని షర్మిల ధ్వజమెత్తారు.


Also Read: Vasantha Krishna Prasad: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. ప్రజలకు మంచి చేద్దాం..

మీ కంటే మోసగాళ్లు లేరు..

‘‘అసలు వైసీపీలో వైఎస్సార్ గారిని, విజయమ్మను అవమానించినవారే కదా పెద్ద వాళ్లు. YSRCPలో YSRని ఎప్పుడో వెళ్లగొట్టారు కదా.. ఇప్పుడు ఉన్నది కేవలం Y అంటే వైవీ సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే ఉన్నారు. కనుక వైఎస్సార్ లాగా అసెంబ్లీలో పోరాడటం మీకు చేత కాదులే.. మీకు మీడియా పాయింటే ఎక్కువ. మీరు మాట్లాడుతున్న పక్క రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసినందుకు గర్వపడుతున్నాం. మరి మీరు రైతులను నిలువునా మోసం చేసింది నిజం కాదా ..? రూ.3 వేల కోట్లతో ప్రతి ఏడాది ధరల స్థిరీకరణ నిధి అన్నారు. రూ.4 వేల కోట్లతో ప్రతి ఏడాది పంట నష్ట పరిహారం అన్నారు. ఇక వైఎస్సార్ జలయజ్ఞం పథకానికి తూట్లు పొడిచారు. మద్యపాన నిషేధం అని దగా చేశారు. మీ కంటే మోసగాళ్లు.. విశ్వసనీయత కోల్పోయిన వాళ్లు ఉంటారా..? మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువు అణువునా పిరికితనంతో మీరు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను, వైఎస్సార్ వ్యతిరేకించిన బీజేపీకి తాకట్టుపెట్టారు! మీ అహంకారమే మీ పతనానికి కారణం’’ అని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Minister Nimmala: మంత్రి సాహసం.. స్వయంగా అక్కడికి ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లి..

Purandeswari: ఏపీలో పథకాల మార్పుపై ఎంపీ పురందేశ్వరి ఏమన్నారంటే?

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 29 , 2024 | 03:55 PM