Share News

Tulasi Reddy: జగన్.. 59 మంది గన్‌మెన్లు చాలదా?.. తులసిరెడ్డి విసుర్లు

ABN , Publish Date - Aug 06 , 2024 | 06:22 PM

మాజీ ముఖ్యమంత్రి, వైస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయడం విడ్డూరంగా ఉందని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ ఎన్. తులసి రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటే అసెంబ్లీలో ఎమ్మెల్యే ల మొత్తం సంఖ్యలో 10 శాతం ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉండాలనే నిబంధనలు చెబుతున్నాయని అన్నారు.

Tulasi Reddy: జగన్.. 59 మంది గన్‌మెన్లు చాలదా?.. తులసిరెడ్డి విసుర్లు
Tulasi Reddy

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 139 మంది గన్‌మె‌న్లను అడుగుతున్నది భద్రత కోసం కాదని స్టేటస్, హంగు, ఆర్భాటం కోసమని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ ఎన్. తులసి రెడ్డి(Tulasi Reddy) విమర్శించారు. జగన్ రెడ్డి 59 మంది గన్‌మెన్లు చాలదా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం తనకు 59 మంది గన్‌మెన్లను ప్రభుత్వం ఇచ్చిందని గుర్తుచేశారు.


ఏపీ ప్రభుత్వం అలా చేయడం తప్పు..

వారు చాలారని...139 మంది గన్‌మెన్లను ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని జగన్ హైకోర్టులో పిటిషన్ వేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇది జగన్ పిరికితనానికి దర్పణమని ఆక్షేపించారు. అయినా ఏపీ ప్రభుత్వం 59 మందిని ఇవ్వడమే తప్పు అని తులసి రెడ్డి చెప్పారు. అందరు ఎమ్మెల్యేలు లాగా జగన్ కూడా ఒక ఎమ్మెల్యే మాత్రమే అని చెప్పారు. ఎమ్మెల్యేలకు 1+1, 2+2గానీ గన్‌మెన్ల భద్రతను మాత్రమే ప్రభుత్వం కల్పిస్తుందని వెల్లడించారు. అలాగే జగన్‌కు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


హైకోర్టులో పిటిషన్ ఎందుకు..?

స్టేటస్ కోసం గన్‌మెన్లను ఇవ్వడం సరికాదని అన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం జగన్ హైకోర్టులో పిటీషన్ వేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేల మొత్తం సంఖ్యలో 10 శాతం ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉండాలనే నిబంధనలు చెబుతున్నాయని గుర్తుచేశారు. వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 11 మాత్రమేనని.. అందుకే గన్‌మెన్లను ఇవ్వలేదని చెప్పారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి లాంటి వారు కేవలం ఎమ్మెల్యే హోదాలో రాణించ లేదా? అని నిలదీశారు. జగన్ చిన్న పిల్లల మాదిరిగా మారాం చేస్తున్నారని తులసిరెడ్డి విమర్శించారు.

Updated Date - Aug 06 , 2024 | 06:30 PM