Home » AP Congress
Andhrapradesh: ‘ఛలో సెక్రటేరియట్’ అంటే తమపై ఆంక్షలు ఎందుకు అంటూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?... వార్తలు రాస్తే దాడులు చేయిస్తారా అని విరుచుకుపడ్డారు. ‘‘నిరుద్యోగంపై అడిగితే మా పైనా , మీడియా పై దాడులా... సిగ్గుందా జగన్ నీకు’’ అంటూ షర్మిల ఫైర్ అయ్యారు.
Andhrapradesh: అప్రజాస్వామికంగా అరెస్టులు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. పోలీసులను తప్పించుకుని షర్మిల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్నారని... పోలీసుల నిర్భందాలను కాంగ్రెస్ ఖండిస్తోందన్నారు.
Andhrapradesh: నిరుద్యోగుల సమస్యలపై ఈరోజు ఛలో సెక్రటేరియట్‌కు కాంగ్రెస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే గత రాత్రి నుంచి ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆంధ్రరత్న భవన్‌లోనే ఉండిపోయారు. అరెస్టు ఈరోజు ఉదయం 10 గంటలకు ఆంధ్రరత్న భవన్ నుంచి షర్మిల ఛలో సెక్రటేరియట్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. అయితే పార్టీ కార్యాలయం నుంచి బయటకి వచ్చిన గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలీలను పోలీసులు అరెస్ట్ చేశారు.
AP Politics: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఛలో సెక్రటేరియట్(Chalo Secretariat) ఆందోళనలో కీలక మలుపు చోటు చేసుకుంది. కుమారిడి వివాహం అనంతరం బుధవారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన వైఎస్ షర్మిల(YS Sharmila).. కేవీపీ ఇంటికి కాకుండా.. సడెన్‌గా రూట్ మార్చేశారు. తొలుత అంపాపురంలోని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు..
కాంగ్రెస్(Congress) పార్టీ ఈనెల 22వ తేదీన సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం తక్కువ పోస్టులు భర్తీ చేసేలా కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ సచివాలయం ముట్టడికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది.
లంగాణ ప్రభుత్వం నుంచి తనను డబ్బులు తెమ్మంటున్నారని... తాను డబ్బులు తెస్తే వైసీపీ నేతలు గాడిదలు కాస్తుంటారా అని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శించారు. ఐదేళ్లుగా ముద్దులు పెట్టుకుంటూ బీఆర్ఎస్తో సీఎం జగన్ దోస్తీ చేశారని సెటైర్లు వేశారు.
సీఎం వైఎస్ జగన్ స్వలాభం కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అడగడం లేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila) అన్నారు. ఆదివారం నాడు తిరుపతిలో షర్మిల పర్యటించారు. వనక్కం అంటూ తమిళంలో మాట్లాడి క్యాడర్‌ను ఉత్సాహపరిచారు.
సీఎం జగన్(CM JAGAN) ఏపీకి స్పెషల్ స్టేటస్ తేలేదు... కానీ మద్యంలో స్పెషల్ స్టేటస్ తెచ్చారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) ఆరోపించారు. నాసిరకం మద్యం తాగి చనిపోతున్న వారిలో ఏపీలో 25 శాతం పెరిగినట్లు తెలిపారు.
వైఎస్ షర్మిల ( YS Sharmila ) కు కాంగ్రెస్‌లో సముచిత స్థానం కల్పిస్తామని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాకూర్ ( Manickam Tagore ) తెలిపారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలకు ఏపీలో బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ( YSR ) మృతిపై సీఎం జగన్ ( CM JAGAN ) చట్టసభల్లో ఇప్పటివరకు ఎందుకు మాట్లాడట్లేదని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) ప్రశ్నించారు. గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైఎస్ మరణంపై వైసీపీ నేతలు చేసిన అర్థరహిత ఆరోపణలు సరికాదని అన్నారు.