Share News

AP Politics: షర్మిల ఎంట్రీ.. కాంగ్రెస్ ఛలో సెక్రటేరియట్ ఆందోళనలో కీలక మలుపు..!

ABN , Publish Date - Feb 21 , 2024 | 10:07 PM

AP Politics: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఛలో సెక్రటేరియట్‌(Chalo Secretariat) ఆందోళనలో కీలక మలుపు చోటు చేసుకుంది. కుమారిడి వివాహం అనంతరం బుధవారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన వైఎస్ షర్మిల(YS Sharmila).. కేవీపీ ఇంటికి కాకుండా.. సడెన్‌గా రూట్ మార్చేశారు. తొలుత అంపాపురంలోని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు..

AP Politics: షర్మిల ఎంట్రీ.. కాంగ్రెస్ ఛలో సెక్రటేరియట్ ఆందోళనలో కీలక మలుపు..!
Chalo Secretariat

గుంటూరు, ఫిబ్రవరి 21: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఛలో సెక్రటేరియట్‌(Chalo Secretariat) ఆందోళనలో కీలక మలుపు చోటు చేసుకుంది. కుమారిడి వివాహం అనంతరం బుధవారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన వైఎస్ షర్మిల(YS Sharmila).. కేవీపీ ఇంటికి కాకుండా.. సడెన్‌గా రూట్ మార్చేశారు. తొలుత అంపాపురంలోని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు(KVP Ramachandra Rao) నివాసానికి వెళ్లాలని భావించారు షర్మిల. అయితే, పోలీసులు అనుసరిస్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు.. వెంటనే రూట్ మార్చి విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్‌కు టర్న్ తీసుకున్నారు. షర్మిల, కాంగ్రెస్ నేతలంతా ఆంధ్ర రత్న భవన్‌కు వెళ్లారు. గురువారం ఉదయం అక్కడి నుంచే ఛలో సెక్రటేరియట్‌కు వెళ్లాలని నిర్ణయించారు.

ఆంధ్రరత్న భవన్‌కు చేరుకున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. ఇవాళ రాత్రి పార్టీ కార్యాలయంలోనే బస చేయనున్నారు. మరోవైపు ఈ ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. తొలుత షర్మిల కేవీపీ నివాసానికి వెళితే.. అక్కడ ఆమెను హౌజ్ అరెస్ట్ చేయాలని భావించారు. వెంటనే అలర్ట్ అయిన షర్మిల, కాంగ్రెస్ నేతలు.. ఆంధ్రరత్న భవన్‌కు చేరుకున్నారు. ముందస్తు అరెస్ట్‌ల నేపథ్యంలో ఇవాళ రాత్రి ఆంధ్రరత్న భవన్‌లోనే ఉండాలని నిర్ణయించారు. గురువారం ఉదయం 10 గంటలకు ఛలో సెక్రటేరియట్‌కి పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లనున్నారు షర్మిల.

కుమారుడి పెళ్లి నుంచి నేరుగా..

కుమారుడి పెళ్లి అనంతరం వైఎస్ షర్మిల ఏపీకి రిటర్న్ అయ్యారు. బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బాపులపాడు మండలం అంపాపురం బయలుదేరారు. అక్కడ కేవీపీ నివాసం ఉండగా.. అక్కడే బస చేయాలని భావించారు. అయితే, పోలీసులు ఫాలో అవడంతో తన వ్యూహం మార్చేశారు షర్మిల. ఎట్టి పరిస్థితుల్లోనూ ‘ఛలో సెక్రటేరియట్’ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామని షర్మిల ప్రకటించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 21 , 2024 | 10:07 PM