Share News

YS Sharmila: వామ్మో.. సొంత అన్న జగన్‌ను షర్మిల ఇలా అనేసారేంటి?

ABN , Publish Date - Feb 22 , 2024 | 11:51 AM

Andhrapradesh: ‘ఛలో సెక్రటేరియట్’ అంటే తమపై ఆంక్షలు ఎందుకు అంటూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?... వార్తలు రాస్తే దాడులు చేయిస్తారా అని విరుచుకుపడ్డారు. ‘‘నిరుద్యోగంపై అడిగితే మా పైనా , మీడియా పై దాడులా... సిగ్గుందా జగన్ నీకు’’ అంటూ షర్మిల ఫైర్ అయ్యారు.

YS Sharmila: వామ్మో.. సొంత అన్న జగన్‌ను షర్మిల ఇలా అనేసారేంటి?

విజయవాడ, ఫిబ్రవరి 22: ఏపీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల (APCC Chief YS Sharmila) బాధ్యతలు చేపట్టాక ముఖ్యమంత్రి జగన్‌పై (CM Jagan) మాటలధాడి మామూలుగా లేదు. సొంత అన్న అని కూడా చూడకుండా సీఎం జగన్‌పై ఎప్పటికప్పుడు షర్మిల విరుచుకుపడుతూనే ఉన్నారు. వైఎస్సార్సీపీ పాలన, జగన్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై (DSC Notification) ఏపీసీసీ చీఫ్.. ప్రభుత్వంతో సమరానికి కాలుదువ్వారు. ఈరోజు షర్మిల ఆధ్వర్యంలో ‘‘ఛలో సెక్రటేరియట్‌’’కు ఏపీ కాంగ్రెస్ (AP Congress) పిలుపునివ్వగా.. పోలీసులు కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిర్బంధం చేశారు. అయితే షర్మిల గత రాత్రే ఆంధ్రరత్న భవన్‌కు చేరుకుని.. ఈరోజు ఛలో సెక్రటేరియట్‌కు వెళ్లాలని నిర్ణయించారు. అయితే ఆంధ్రరత్న భవన్‌ వద్ద పోలీసుల ఆంక్షలపై షర్మిల తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఛలో సెక్రటేరియట్ అంటే తమపై ఆంక్షలు ఎందుకు అంటూ ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?... వార్తలు రాస్తే దాడులు చేయిస్తారా అని విరుచుకుపడ్డారు. ‘‘నిరుద్యోగంపై అడిగితే మా పైనా , మీడియాపై దాడులా... సిగ్గుందా జగన్ నీకు’’ అంటూ షర్మిల ఫైర్ అయ్యారు.

మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ..

‘‘రాష్ట్రం లో అతి పెద్ద సమస్య ల్లో ఒకటి నిరుద్యోగం. చదువుకున్న చదువులకు సంబంధం లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. 21 వేల మంది బిడ్డలు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. డిగ్రీ, పిజీలు చేసిన బిడ్డలు యేడాదిలో ఐదు వందల మంది బలవన్మరణం చెందుతున్నారు. ప్రత్యేక హోదా రాక, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక వలసలు పోతున్నారు. మన రాష్ట్రం యువతే లేని రాష్ట్రంగా మారే ప్రమాదం ఉంది. జగన్ ప్రభుత్వం (Jagan Government) ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలి. చంద్రబాబు హయాంలో కూడా యువతకి అన్యాయం జరిగింది. హోదా ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగింది. లక్షా 43 వేల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని జగన్ అధికారంలోకి వచ్చారు. మెగా డీఎస్సీ భర్తీ విషయంలో ఆనాడు‌ చంద్రబాబును విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ ఇవ్వకుండా దగా డీఎస్సీ ఇచ్చారు. దీనిపై మాకు నిరసన కార్యక్రమం చేసే హక్కు లేదా. మా వాళ్లను అన్యాయంగా అరెస్టు చేసి నియంత్రించారు’’ అంటూ ఏపీసీసీ చీఫ్ మండిపడ్డారు.


మేము దొంగలమా?.. టుర్రరిస్టులమా?

ఛలో సెక్రటేరియట్ అంటే మాపై ఆంక్షలు ఎంందుకు? జగన్ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? వార్తలు రాస్తే దాడులు చేయిస్తారా?... ఇదేనా ప్రజాస్వామ్యం? రైట్ టూ స్పీచ్ అనేది ఏపీలో లేదా? ఇదేమైనా తాలిబాన్‌లో ఉందా? రాత్రికి రాత్రి, ఉదయం అరెస్టులతో కర్ఫ్యూ వాతావరణం తెచ్చారు. మేము దొంగలమా, బందిపోట్లమా, టెర్రిస్టులమా? మీరు అన్నీ బాగా చేసి ఉంటే... మీకెందుకు భయం. నిజంగా ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మీరు భయపడాల్సిన అవసరం ఏముంది. జర్నలిస్టులు, ప్రతిపక్షపార్యపై దాడులు చేస్తున్నారు. అంటే మీరేమీ ప్రజలకు చేయలేదనే కదా అర్ధం. ఎన్నికల సమయంలో జగన్ జాబ్ నోటిఫికేషన్‌ల వరద పారిస్తాం, జ్యాబ్ క్యాలెండర్‌ అన్నారా లేదా. మరి ఈ హామీలు ఎందుకు అమలు చేయలేదో జగన్ చెప్పాలి. మాకు ఉద్యోగ, ఉపాధి అంశాలే ప్రాధాన్యత అన్నారు. చంద్రబాబును (TDP Chief Chandrababu Naidu) సిగ్గులేదా అని తిట్టిన జగన్... అంతకన్నా సిగ్గులేకుండా చేశారు. జగన్ ఆనాడు ఏం తిట్టారో అవన్నీ ఇప్పుడు ఆయనకే వర్తిస్తాయి. దేవుని దయతో సీఎం అయ్యారు... మీ దయ నిరుద్యోగ యువతపై లేదు. మీకు సీఎం ఉద్యోగం వచ్చింది... యువతకు ఉద్యోగం ఏది?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

కుంభ కర్ణుడిలా నిద్ర పోయారా?

ప్రత్యేక హోదా పై ఒక్క రోజు అయినా పోరాటం చేశారా? రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయని మీరే చెప్పారు. ఈ ఐదేళ్లల్లో ఏం చేశారు?... గుడ్డి గుర్రానికి పళ్లు తోమారా, కుంభ కర్ణుడిలా నిద్ర పోయారా? ఇప్పుడు ఎన్నికల వేళ మొక్కుబడి ప్రకటనతో మోసం చేస్తారా? ఆరు వేల ఉద్యోగాలకు మెగా డీఎస్సీ ఏంటి... ‌ఇది దగా డీఎస్సీ కాదా? చిత్తశుద్ధి లేని జగన్ యుతవ జీవితాలను నాశనం చేశారు. ముప్పై రోజుల ముందు హఠాత్తుగా పరీక్ష అంటే ఎలా? వాళ్లు ప్రిపేరు కాకుండా ఫెయిల్ చేయాలని కుట్ర చేస్తారా? 2.30లక్షల ఉద్యోగాల్లో ఎన్ని భర్తీ చేశారు. పట్టపగలే నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు. అడిగితే మా పైనా , మీడియా పై దాడులా... సిగ్గుందా జగన్ నీకు’’ అంటూ సీఎం జగన్‌పై షర్మిల ఘాటు విమర్శలు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 22 , 2024 | 12:27 PM