Gidugu Rudraraju: పోలీసుల నిర్భందాలను కాంగ్రెస్ ఖండిస్తోంది..
ABN , Publish Date - Feb 22 , 2024 | 10:03 AM
Andhrapradesh: అప్రజాస్వామికంగా అరెస్టులు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. పోలీసులను తప్పించుకుని షర్మిల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్నారని... పోలీసుల నిర్భందాలను కాంగ్రెస్ ఖండిస్తోందన్నారు.
విజయవాడ, ఫిబ్రవరి 22: అప్రజాస్వామికంగా అరెస్టులు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు (CWC Member Gidugu Rudraraju) మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. పోలీసులను తప్పించుకుని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (APCC Chief YS Sharmila) కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్నారని... పోలీసుల నిర్భందాలను కాంగ్రెస్ ఖండిస్తోందన్నారు. సెక్షన్ 144, సెక్షన్ 30 అని పోలీసులు చెపుతున్నారని తెలిపారు. యువజన , విద్యార్థి సంఘాలు ఇప్పటికే మంత్రుల ఇళ్లను ముట్టయించాయన్నారు. జగన్ ఇచ్చిన హామీని అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో షర్మిల నిరసన ధర్నా చేస్తారని.. తరువాత ‘‘ఛలో సెక్రటేరియట్’’ ఉంటుందని గిడుగు రుద్రరాజు వెల్లడించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..