Home » AP High Court
Andhrapradesh: క్యాంప్ కార్యాలయాల ముసుగులో విశాఖకు రాజధాని కార్యాలయాల తరలింపుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ హైకోర్టులో విచారణకు రాగా.. విచారణ నుంచి తాను తప్పుకుంటున్నానని న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు ప్రకటించారు.
Andhrapradesh: వైసీపీ సర్కార్‌కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖకు కార్యాలయాల తరలింపు హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ప్రభుత్వ లంచ్‌మోషన్ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. క్యాంపు ఆఫీస్‌ల ఏర్పాటుపై సింగిల్ జడ్జి దగ్గర రైతుల పిటిషన్లు త్రిసభ్య ధర్మాసనంకు పంపారని సీజే ధర్మాసనం ముందు ప్రభుత్వ లాయర్ సుమన్ చెప్పారు. తీర్పు వచ్చే వరకు ఆఫీస్‌లు తరలించవద్దని సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారని ప్రభుత్వ న్యాయవాది సుమన్ తెలిపారు.
AP High Court: ‘ఏపీలోని జగన్ ప్రభుత్వం చేపట్టిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తున్నారని పిటిషనర్ ఆరోపించగా.. అదే విషయాన్ని పిటిషన్ తరఫు న్యాయవాది ధర్మాసనం ముందు వాదించారు.
Andhrapradesh: ప్రభుత్వ జీవోలను జీవోఐఆర్‌లో పెట్టకపోవడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు రాజ్యాంగ పరమైన అంశాలు ఇమిడి ఉండటంతో లోతుగా విచారణ చేయాల్సి ఉందని పేర్కొంది. జీవోలకు సంబంధించిన తీర్పులను మెమో రూపంలో వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీఈ గెజిట్‌లో ఐదు శాతం మాత్రమే జీవోలను పెడుతున్నారని న్యాయవాది ఉమేష్ చంద్ర తెలిపారు.
Andhrapradesh: టీటీడీ నిధులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు విడుదలపై హైకోర్ట్‌లో విచారణ జరిగింది. గతంలో నిధుల విడుదలను నిలిపి వేయాలని హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది.
Andhrapradesh: ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన లిఖిత పూర్వక వాదనల్లో టీడీపీ నేత లోకేష్‌పై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈరోజు (శనివారం) హైకోర్టులో దాఖలు చేశారు.
Andhrapradesh: క్యాంప్ కార్యాలయం ముసుగులో రాజధాని కార్యాలయాల తరలింపుపై హైకోర్ట్ సీరియస్ వ్యాఖ్యలు చేసింది.
ఎస్ఐ అభ్యర్థుల ఎత్తు కొలతలకు సంబంధించిన వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ వైద్యుల నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని అభ్యర్థులను హైకోర్ట్ ధర్మాసనం ప్రశ్నించింది.
Andhrapradesh: రుషికొండలో అక్రమాలపై హైకోర్ట్‌లో అనుబంధ పిటిషన్ దాఖలైంది. పరిశీలనకు వచ్చిన కమిటీకి అక్రమాలపై పిటిషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విశాఖ జన సేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తరపున పిటిషన్ దాఖలైంది.
Andhrapradesh: స్కిల్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి దాఖలు చేసిన పిల్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను సీబీఐకి అప్పగించేందుకు తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.