Share News

AP HighCourt: విశాఖకు రాజధాని కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో విచారణ

ABN , Publish Date - Jan 02 , 2024 | 01:12 PM

Andhrapradesh: క్యాంప్ కార్యాలయాల ముసుగులో విశాఖకు రాజధాని కార్యాలయాల తరలింపుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ హైకోర్టులో విచారణకు రాగా.. విచారణ నుంచి తాను తప్పుకుంటున్నానని న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు ప్రకటించారు.

AP HighCourt: విశాఖకు రాజధాని కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో విచారణ

అమరావతి, జనవరి 2: క్యాంప్ కార్యాలయాల ముసుగులో విశాఖకు రాజధాని కార్యాలయాల తరలింపుపై మంగళవారం హైకోర్టులో (AP HighCourt) విచారణ జరిగింది. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ హైకోర్టులో విచారణకు రాగా.. విచారణ నుంచి తాను తప్పుకుంటున్నానని న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు ప్రకటించారు. దీంతో మరో బెంచ్‌కు పంపాలని రిజిస్ట్రీని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.

గతంలో ప్రభుత్వ నిర్ణయాన్ని రాజధాని రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో సంబధిత బెంచ్ నిర్ణయం తీసుకునే వరకు కార్యాలయాలు తరలించవద్దని సింగిల్ జడ్జ్ ఆదేశించారు. అయితే సింగిల్ జడ్జి ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది. ప్రభుత్వం అప్పీల్‌ను ఈరోజు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ ప్రారంభమవగానే న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగా.. మరో బెంచ్‌కు పంపాలని రిజిస్ట్రీని ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 02 , 2024 | 01:12 PM