Home » AP High Court
Andhrapradesh: స్కిల్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి దాఖలు చేసిన పిల్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను సీబీఐకి అప్పగించేందుకు తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
ఐ.ఆర్.ఆర్. అలైన్మెంట్ కేసులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) ముందస్తు బెయిల్ పిటీషన్‌పై హైకోర్టు ( High Court ) లో విచారణ జరిగింది. అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం హైకోర్టులో వాదనలు వినిపించారు.
AP High Court: గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి ఏపీ హైకోర్టు 30 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. కోర్టు ఆదేశాలు ధిక్కరించారనే కారణంతో ఆమెకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.2వేల జరిమానా కూడా కట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి నుంచి విశాఖపట్నానికి క్యాంపు ఆఫీస్‌ల ముసుగులో రాజధాని తరలింపు పిటిషన్‌పై మంగళవారం నాడు ఏపీ హైకోర్టు ( High Court ) లో మరోసారి విచారణ జరిగింది. రాజధాని ఆఫీసులు ప్రస్తుతం తరలించడం లేదని.. ఆఫీస్‌లు తరలిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అపోహ మాత్రమేనని హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్లో తెలిపింది.
క్యాంపు కార్యాలయాల ముసుగులో విశాఖపట్నానికి ( Visakhapatnam) రాజధాని తరలింపు పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు (AP High Court ) కీలక ఆదేశాలు జారీ చేసింది. రోస్టర్ ప్రకారం బెంచ్ ముందుకు పిటిషన్ వచ్చిందని, విచారించిన తర్వాతే ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు.
ప్రజాప్రతినిధుల కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ఏపీ హైకోర్ట్ కీలక చర్యలు చేపట్టింది. సుమోటోగా పిల్‌ను హైకోర్టు నమోదు చేసింది. ఇందులో చీఫ్ సెక్రటరీ, డీజీపీ, స్పెషల్ పీపీ విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్ట్‌లను ప్రతివాదులుగా హైకోర్ట్ చేర్చింది.
అమరావతి: రాజధాని రైతులకు కౌలు చెల్లించాలని రైతు పరిరక్షణ సమితి, రైతు సమాఖ్య తరపున వేసిన పిటేషన్లకు విచారణ అర్హత ఉందని గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ పిటీషన్లకు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాదుల అభ్యంతరం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ఎక్స్ వేదికగా తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasa Rao ) తీవ్ర విమర్శలు గుప్పించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసు ( skill development Case )లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఏ 13గా ఉన్న చంద్రకాంత్‌ను సీఐడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. అప్రూవర్‌గా మారుతున్నట్టు చంద్రకాంత్ కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ జనవరి 5వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. జనవరి 5వ తేదీన చంద్రకాంత్ స్టేట్మెంట్ను ఏసీబీ కోర్టు రికార్డు చేయనున్నది.
Andhrapradesh: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజు నియంత్రణ మండలి ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులు ఖరారు చేసిన ప్రక్రియను ధర్మాసనం తోసిపుచ్చింది.