Home » AP High Court
ఎనిమిదో తరగతి వరకు కామన్ ఎగ్జామినేషన్ పరీక్షలను ఏపీ హైకోర్ట్ ( AP High Court) రద్దు చేసింది. ఈ మేరకు న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు పరీక్షలు నిర్వహించడం, విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 29కి వ్యతిరేకమని హైకోర్టు తీర్పు చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు మధ్యంతర బెయిల్‌ను తిరస్కరించింది హైకోర్టు ధర్మాసనం. బేవరేజెస్ కార్పొరేషన్లో భారీ అవినీతి జరిగిందని.. కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఫైళ్లు తీసుకెళ్లారని వాసుదేవ రెడ్డిపై పలువురు ఫిర్యాదు చేశారు.
2024 సార్వత్రిక ఎన్నికలలో ఘనవిజయం సాధించిన తెలుగుదేశం పార్టీ కూటమికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అక్కెన వేణుగోపాలరావు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గతి తప్పిన రాష్ట్ర పాలనను కొత్తగా కొలువైన ప్రభుత్వం సత్వరమే గాడిన పెట్టాలని హైకోర్ట్ ఉద్యోగుల సంఘం కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన నూతన పీఆర్సీని వీలైనంత త్వరగా అమలుచేసి ఈ లోగా తగినంత ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని సంఘం కోరింది.
మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ముందస్తు బెయిల్ రద్దుపై రేపు(సోమవారం) సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణ జరుగనున్నది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ చేపట్టునున్నది.
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీకి (YSR Congress) హైకోర్టు గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్(Postal Ballots) డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్-13ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది...
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి, జస్టిస్ ఏవీ శేషసాయి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీకి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్-13ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేశాం.. ఇక ప్రమాణ స్వీకారం, సంబరాలే ఆలస్యం అన్నట్లుగా అసలు సిసలైన ఫలితాలకు ముందే తెగ హడావుడి చేస్తున్న వైసీపీకి ఊహించని ఝలక్ తగిలింది...
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ దాఖలు చేసిన వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇ
ఏపీ హైకోర్టు (AP High Court) ఇచ్చిన ఉత్తర్వులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని(CS Jawahar Reddy) సీనియర్ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) ఈ రోజు (గురువారం) కలిశారు. క్యాట్ ఉత్తర్వుల ప్రకారం ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇచ్చి, జీత భత్యాలను ప్రభుత్వం చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది.