AP Election Results 2024: అటు ఎగ్జిట్ పోల్స్.. ఇటు వైసీపీకి ఊహించని ఝలక్
ABN , Publish Date - Jun 01 , 2024 | 08:45 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేశాం.. ఇక ప్రమాణ స్వీకారం, సంబరాలే ఆలస్యం అన్నట్లుగా అసలు సిసలైన ఫలితాలకు ముందే తెగ హడావుడి చేస్తున్న వైసీపీకి ఊహించని ఝలక్ తగిలింది...
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Elections 2024) గెలిచేశాం.. ఇక ప్రమాణ స్వీకారం, సంబరాలే ఆలస్యం అన్నట్లుగా అసలు సిసలైన ఫలితాలకు ముందే తెగ హడావుడి చేస్తున్న వైసీపీకి ఊహించని ఝలక్ తగిలింది. పోస్టల్ బ్యాలెట్లపై మొదట్నుంచీ వైసీపీ ఎంత హడావుడి చేస్తోందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పోస్టల్ బ్యాలెట్‌డిక్లరేషన్‌కు సంబంధించి ఫాం-13ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, ఆయన హోదా, వివరాలు పేర్కొనప్పటికీ, ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటవుతుందని స్పష్టత ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఇచ్చిన ఉత్తర్వులను వైసీపీ హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. పోస్టల్ బ్యాలెట్‌పై సీలు లేకున్నా సరే కౌంటింగ్‌కు అర్హత ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా.. సీలుపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరణతో న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో వైసీపీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ పరిణామంతో వైసీపీకి గట్టి షాక్ తగిలినట్లయ్యింది.