Andhra Pradesh: వాసుదేవ రెడ్డికి షాక్.. బెయిల్ తిరస్కరించిన హైకోర్టు..
ABN , Publish Date - Jun 13 , 2024 | 01:53 PM
ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు మధ్యంతర బెయిల్‌ను తిరస్కరించింది హైకోర్టు ధర్మాసనం. బేవరేజెస్ కార్పొరేషన్‌లో భారీ అవినీతి జరిగిందని.. కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఫైళ్లు తీసుకెళ్లారని వాసుదేవ రెడ్డిపై పలువురు ఫిర్యాదు చేశారు.
అమరావతి, జూన్ 13: ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు మధ్యంతర బెయిల్‌ను తిరస్కరించింది హైకోర్టు ధర్మాసనం. బేవరేజెస్ కార్పొరేషన్‌లో భారీ అవినీతి జరిగిందని.. కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఫైళ్లు తీసుకెళ్లారని వాసుదేవ రెడ్డిపై పలువురు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు వాసుదేవ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
దీంతో ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ వాసుదేవ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని వాసుదేవ రెడ్డి తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అనంతరం కేసు విచారణను జూన్ 18వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలాఉంటే.. ఇప్పటికే వాసుదేవ రెడ్డి ఇంట్లో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏ క్షణమైనా వాసుదేవ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.