Share News

AB Venkateswara Rao: నాకు పోస్టింగ్ ఇవ్వండి.. ఏపీ సీఎస్‌ను కోరిన ఏబీ వెంకటేశ్వరరావు

ABN , Publish Date - May 30 , 2024 | 05:28 PM

ఏపీ హైకోర్టు (AP High Court) ఇచ్చిన ఉత్తర్వులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని(CS Jawahar Reddy) సీనియర్ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) ఈ రోజు (గురువారం) కలిశారు. క్యాట్ ఉత్తర్వుల ప్రకారం ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇచ్చి, జీత భత్యాలను ప్రభుత్వం చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది.

AB Venkateswara Rao: నాకు పోస్టింగ్ ఇవ్వండి.. ఏపీ సీఎస్‌ను కోరిన ఏబీ వెంకటేశ్వరరావు

అమరావతి: ఏపీ హైకోర్టు (AP High Court) ఇచ్చిన ఉత్తర్వులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని(CS Jawahar Reddy) సీనియర్ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) ఈ రోజు (గురువారం) కలిశారు. క్యాట్ ఉత్తర్వుల ప్రకారం ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇచ్చి, జీత భత్యాలను ప్రభుత్వం చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని పెద్ద ఎత్తున నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. దాంతో హైకోర్టు తీర్పు కాపీని, క్యాట్ ఉత్తర్వులను పరిశీలించి తనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావు సీఎస్‌ను కోరారు. తాను ఈ విషయాన్ని పరిశీలిస్తానని సీఎస్ జవహర్ రెడ్డి ఏబీ వెంకటేశ్వరరావుకి తెలిపారు.


కాగా.. ఏబీ వెంకటేశ్వరరావుకి ఈరోజు(గురువారం) ఉదయం ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఉత్తర్వులను సస్పెండ్‌ చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఏబీవీ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఇటీవల క్యాట్‌ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. క్యాట్‌ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసేందుకు నిరాకరిస్తూ ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టివేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

AP Elections2024: చంద్రబాబును కలిసిన పిన్నెల్లి బాధితుడు మాణిక్యాలరావు

AP Politics: సీఎస్ జవహర్ రెడ్డి‌పై మరోసారి సంచలన ఆరోపణలు చేసిన జనసేన నేత

AP Election2024: ఆందోళనలను ప్రేరేపించేలా సజ్జల వ్యాఖ్యలు: దేవినేని ఉమ

AP Election Result: కాన్ఫిడెన్స్ తగ్గిందా.. ఫలితాలకు ముందు వైసీపీ నేతల్లో టెన్షన్..!

AP politics: పేట్రేగిపోతున్న వైసీపీ మూకలు.. బెంబేలెత్తుతున్న ఎన్నికల అధికారులు..!

Chandrababu: చంద్రబాబు ఎఫెక్ట్.. యూపీఎస్సీ నిర్ణయంతో కంగుతిన్న వైసీపీ!

Updated Date - May 30 , 2024 | 05:40 PM