Home » AP Pensions
Andhrapradesh: ఏపీలో పెన్షన్ల పంపిణీ అంశం ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. ఇస్తామన్న సమయకంటే ఆలస్యంగా పెన్షన్ల పంపిణీ జరిగింది. ఈ క్రమంలో పెన్షన్లు తీసుకోడానికి సచివాలయాలకు వచ్చిన వృద్ధులు మండుటెండలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొందరు తనువులు కూడా చాలించారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ సీరియస్ తీసుకుని ఈసీకి లేఖలు కూడా రాసింది. అయితే వృద్ధులు చనిపోవడంపై తాజాగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ... టీడీపీ, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కేంద్ర ఎన్నికల సంఘా ( Central Election Commission)నికి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) లేఖ రాశారు. ఇంటింటికీ పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా 33 మంది పెన్షన్ దారులు చనిపోయారని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తూ శుక్రవారం లేఖ రాశారు.
రాష్ట్ర యువత ఈ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) అన్నారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా నంద్యాల జిల్లాలో పర్యటించారు. చంద్రబాబు(Chandrababu) అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.
Andhrapradesh: పింఛన్ల విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. తండ్రి చనిపోయినప్పుడు, బాబాయ్ చనిపోయినప్పుడు రాజకీయ లబ్ది పొందారన్నారు. వాలంటీర్లను చంపేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.
పింఛన్ల పంపిణీపై సీఎం జగన్ (CM Jagan) శవ రాజకీయం చేస్తున్నారని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఆరోపించారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై జగన్, వైసీపీ నేతలు నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.
Andhrapradesh: ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. పెన్షన్ల పంపిణీపై ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఈసీ నేరుగా సమాచారం సేకరిస్తోంది. పలు జిల్లాలలో పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం వివరాలు తీసుకుంది. కేంద్ర ఎన్నికల అబ్జర్వర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ జరుగుతున్న తీరుపై ఈసీ వివరాల సేకరించే పనిలో పడింది.
Andhrapradesh: ఏపీలో ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా పెన్షన్ల పంపిణీ అంశమే కనిపిస్తోంది.. వినిపిస్తోంది. పెన్షన్లపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలు కూడా తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇదిలా ఉండగా పెన్షన్ల కోసం ఎదురు చూసిన పెన్షన్ దారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి నుంచి పెన్షన్ల పంపిణీ షురూ అయినప్పటికీ మొదటి రోజు ఎంతటి హంగామా జరిగిందో అందరికీ తెలిసిందే.
Andhrapradesh: పేదలకు ఫించన్ అందకుండా చేసే వైసీపీ కుట్రలను ఎందాకైనా అడ్డుకుంటామని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పైశాచికత్వానికి చంద్రబాబు పోరాటతత్వానికి మధ్య జరిగే పోరులో ప్రజలు తమ వెంటే ఉన్నారన్నారు. చంద్రబాబు పోరాటం మానవత్వం కోసమని.. జగన్ పాకులాట మనుషుల్ని హింసించడమని మండిపడ్డారు. తెలుగుదేశం ధ్యేయం పేదల సంక్షేమం అయితే.. వైసీపీ లక్ష్యం శవ రాజకీయమని విమర్శలు గుప్పించారు.
వైసీపీ నీచ రాజకీయం మరోసారి బట్టబయలైంది. పింఛను సొమ్ము సకాలంలో విడుదల చేయకుండా... అవ్వాతాతలకు అందించే వీల్లేకుండా చేసి..
AP Elections 2024: ఎన్నికలు సమీపించేసరికి గ్రామ, వార్డు వలంటీర్లు రాజకీయ ముసుగు తొలగించి, అసలు స్వరూపం బయటపెడుతున్నారు. పింఛన్ల పంపిణీకి దూరంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడంతో..