CM Chandrababu : స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం
ABN , Publish Date - Jun 29 , 2024 | 03:15 PM
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్వయంగా పెన్షన్లను ఇంటి వద్దనే పంపిణీ చేయనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షనర్ల ఇంటికి వెళ్లి పెన్షన్లను స్వయంగా ఇవ్వనున్నారు.
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షనర్ల ఇంటికి వెళ్లి పెన్షన్లను తన చేతుల మీదుగా అందజేయనున్నారు. దేశ చరిత్రలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సీఎం పెన్షన్ పంపిణీ చేయడం ఇదే మొదటిసారి. పేదింటి మహిళకు సీఎం స్వయంగా పెన్షన్ అందచేయడం ఇదే ప్రథమం. సీఎం పర్యటనతో పెనుమాక వచ్చి అధికారులు పరిశీలించారు. పెన్షన్ లబ్ధిదారుల జాబితా అధికారులు సేకరించారు.
జూలై ఒకటి నుంచి పెన్షన్ల పంపిణీ
కాగా.. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను జూలై ఒకటో తేదీనే పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పింఛన్లు పంపిణీ జరగాలన్నారు. ప్రతి ఉద్యోగి 50 పింఛన్లు పంచేలా సర్దుబాటు చేయాలని ఆదేశించారు. ఇందుకు క్లస్టర్ విధానం అనుసరించాలన్నారు. ప్రతి క్లస్టర్‌కు సిబ్బందిని పక్కాగా మ్యాపింగ్ చేయాలన్నారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఇవ్వరాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.