AP Govt: ఫించన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Jun 29 , 2024 | 07:00 PM
ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణీపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ (CS Nirab Kumar Prasad) కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లతో ఈరోజు (శనివారం) సీఎస్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
అమరావతి: ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణీపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ (CS Nirab Kumar Prasad) కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లతో ఈరోజు (శనివారం) సీఎస్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సమావేశంలో పెన్షన్లకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. జూలై 1వ తేదీన 65 లక్షల 18వేల 496 మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటి ఫించన్లు పంపిణీ చేయనున్నారు.
పంపిణీకి సంబంధించి రూ.4 వేల 399.89 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు. అదే విధంగా ఫించన్ల పంపిణీకి ఇతర ఫంక్షనరీల సేవలను కూడా వినియోగించుకునేందుకు జిల్లా కలెక్టర్లు ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ఫించన్లు పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు గంట గంటకూ పర్యవేక్షించాలని ఆదేశించారు.
సోమవారం ఉదయం 6గంటలకు పింఛన్లు పంపిణీ ప్రారంభం కావాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 1వ తేదీన 90 శాతానికి పైగా పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. ఫించన్లు పంపిణీకి సంబంధించి ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసిన మొత్తాన్ని శనివారం రాత్రిలోగా విత్ డ్రా చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఏ బ్యాంకైనా డబ్బును శనివారం రాత్రికి ఇవ్వకపోతే అలాంటి బ్యాంకులు ఆదివారం తెరిచి ఉంచి సంబంధిత ఫించన్ మొత్తాన్ని ఇవ్వాలని బ్యాంకులకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.