AP Pensions: పండుటాకులపై పగబట్టిన జగన్ సర్కార్.. బ్యాంకుల చుట్టూ తిరిగినప్పటికీ..
ABN , Publish Date - May 04 , 2024 | 01:34 PM
Andhrapradesh: రాష్ట్రంలో పండుటాకులపై జగన్ సర్కార్ పగబట్టింది. పెన్షన్‌దారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత రెండు రోజుల పెన్షన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ పెన్షన్ డబ్బులు అందక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అపసోపాలు పడి బ్యాంకులకు వస్తే బ్యాంకు అధికారులు పెట్టిన రూల్స్‌తో పెన్షన్‌దారులు నీరసించిపోతున్నారు.
అమరావతి, మే 4: రాష్ట్రంలో పండుటాకులపై జగన్ సర్కార్ (AP Government) పగబట్టింది. పెన్షన్‌దారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత రెండు రోజుల పెన్షన్ల (AP Pension) కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ పెన్షన్ డబ్బులు అందక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అపసోపాలు పడి బ్యాంకులకు వస్తే బ్యాంకు అధికారులు పెట్టిన రూల్స్‌తో పెన్షన్‌దారులు నీరసించిపోతున్నారు. ఇంటికే వచ్చి పెన్షన్ ఇవ్వాలంటూ పెన్షనదారులు వేడుకుంటున్న పరిస్థితి.
BRS: ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు బిగ్ షాక్... ఆ కీలక నేతతో పాటు మరికొందరు నేతల రాజీనామా
ఇటు శనివారం కూడా ఫించను కోసం వృద్ధులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అకౌంట్లు ఇన్ ఆపరేటివ్‌గా ఉన్నాయి కాబట్టి రూ.500 అకౌంట్‌లో మెయింటెయిన్ చేయాలని సబ్బంది చెబుతున్నారు. అప్పోసోప్పో చేసి బ్యాంకుల్లో సొమ్ము వేసినా నాలుగురోజులు యాక్టివ్ కావడానికి సమయం పడుతుందని సిబ్బంది తెలిపారు. పటమట యూనియన్ బ్యాంకుకు వెళితే పెన్షన్ ఇస్తారని చెప్పడంతో ఉదయాన్నే ఓ వృద్ధురాలు అక్కడికు చేరుకుంది. అయితే హోం బ్రాంచ్ బంటుమిల్లి అంటూ అక్కడి వెళ్లి పెన్షన్ తెచ్చుకోవాలి సిబ్బంది తెలిపారు. దీంతో వృద్ధులు ఏం చేయాలో తెలియక ఆవేదనతో దిక్కుతోచని స్ధితిలో ఉన్నారు.
AP Elections: తాడేపల్లి 'కొంప' ముంచిందా.. భయంతో బతుకుతున్న జగన్..!
ఏదో ఒకటి చేసి పెన్షన్ సొమ్ములు ఇంటికే పంపాలని వృద్ధులు కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇంటికి వచ్చి ఇవ్వాలని పెన్షన్ దారులు వేడుకుంటున్నారు. ఇప్పటికే రెండు సార్లు బ్యాంకుల చుట్టూ తిరిగినప్పటికీ వృద్ధులు ఇంకా పెన్షన్ తీసుకోలేకపోయారు. అటు వికలాంగుల పరిస్ధితి మరింత దారుణంగా తయారైంది. జేబులో పైసాలేదంటూ వికలాంగులు ఆవేదన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Amit Shah: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో తెలంగాణకు చెందిన అరుణ్ రెడ్డి అరెస్ట్
PM Modi: మీ ఓటు అవినీతి కాంగ్రెస్‌ని మట్టుబెట్టింది.. జార్ఖండ్ వేదికగా మోదీ ఘాటు విమర్శలు
Read Latest AP News And Telugu News