Home » Arrest
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడు, నాలుగు రోజుల్లో అరెస్ట్ చేస్తారని మంత్రి అతిషి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు గల కారణం తమ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమేనని వివరించారు.
సీనియర్ నటి, పొలిటీషియన్ జయప్రదను అరెస్టు చేయాలంటూ ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు మంగళవారంనాడు సంచలన ఆదేశాలు జారీ చేసింది. జయప్రదను అరెస్టు చేసేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేయాలని, ఈనెల 27వ తేదీన కోర్టులో హాజరుపరచాలని సూపరింటెడెండ్ ఆఫ్ పోలీస్‌ని కోర్టు ఆదేశించింది.
జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ తనను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించనుంది.
జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు.
విజయవాడ: తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడ ధర్నా చౌక్ శిబిరంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీలను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. శిబిరంలో ఉన్న సుమారు 2వేల మందిని మూకుమ్మడిగా పోలీసులు అరెస్టులు చేశారు. టెంట్ కూల్చేసి, లైట్లు ఆపేసి మహిళలను బలవంతంగా ఈడ్చుకుంటూ బస్సుల్లో ఎక్కించారు.
ముంబై, జనవరి 11: 12 రోజులు.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 1200 కిలోమీటర్ల పాటు గాలింపు.. ఎట్టకేలకు రెండు హత్యల కేసులో నిందితుడిని పట్టుకున్నారు ముంబై పోలీసులు. మలాడ్ వెస్ట్‌లో తన భార్యను, సోదరుడిని హత్య చేసి పారిపోయిన నిందితుడు డ్రేసన్ ఎం దాస్‌ను చివరకు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో పట్టుకున్నారు.
హిందూ సాంప్రదాయంలో ఆవులకు విశేష ప్రాధాన్యత ఉంది. గోమాతను దైవంతో సమానంగా పూజిస్తుంటారు. అలాంటి మూగజీవులను అక్రమంగా తరలిస్తున్న కేసులో భాగంగా ఓ నిందితుడి కోసం గాలింపు చేపట్టగా పోలీసులకు, అతనికి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి
హైదరాబాద్: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిన్న రాత్రి గజ్వేల్‌లో ప్రశాంత్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు గంటల పాటు విచారించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
మనీ లాండరింగ్ కేసులో పంజాబ్‌లోని అమర్‌గఢ్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జస్వంత్ సింగ్ గజ్జన్ మాజరాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు అరెస్టు చేసింది. 60 ఏళ్ల గజ్జన్ మాజరాపై గత ఏడాది మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (Nara Chandrababu) 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో (Rajahmundry Central Jail) ఉంటున్నారు. జైలుకెళ్లిన మొదటి వారం నుంచే బాబు అనారోగ్యానికి గురయ్యారు..