Pallavi Prashant: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు రిమాండ్
ABN , Publish Date - Dec 21 , 2023 | 07:38 AM
హైదరాబాద్: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిన్న రాత్రి గజ్వేల్‌లో ప్రశాంత్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు గంటల పాటు విచారించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
హైదరాబాద్: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిన్న రాత్రి గజ్వేల్‌లో ప్రశాంత్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు గంటల పాటు విచారించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. రాత్రి జడ్జి నివాసంలో పల్లవి ప్రశాంత్‌తో పాటు ఆయన సోదరుడిని పోలీసులు ప్రవేశపెట్టారు. దీంతో న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని సోదరుని చంచల్‌గూడా జైలుకు తరలించారు.
బిగ్‌బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్, అతని సోదరుడిని జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ప్రశాంత్‌ను ఏ-1గా, అతని సోదరుడు మనోహర్‌ను ఏ-2గా పేర్కొంటూ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరూ మూడ్రోజులుగా పరారీలో ఉండగా.. ప్రశాంత్ స్వగ్రామం గజ్వేల్‌లోని కొల్గూరులో బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 17న బిగ్‌బాస్ సీజన్-7 ఫైనల్స్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్దకు అభిమానులు పెద్దఎత్తున చేరుకున్నారు. వీరిలో కొందరు విధ్వంసకాండకు తెరతీశారు. సీజన్-6 కాంటెస్టెంట్ గీతూరాయల్, ప్రస్తుత సీజన్‌లో పోటీదారులు అశ్విని కార్లపై రాళ్ల దాడి చేశారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో లాఠీలను ఝళిపించారు. దాంతో అల్లరిమూకలు రోడ్లపైకి పరుగులు తీస్తూ ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలను పగులగొట్టారు. ఈ ఘటనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటన జరుగుతున్నప్పుడు బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు మరో గేటు నుంచి పంపారు. అప్పటికే ప్రశాంత్‌ను ర్యాలీగా తీసుకెళ్లేందుకు అతని సోదరుడు మనోహర్, మిత్రుడు వినయ్ రెండు కార్లను బుక్ చేశారు. పోలీసులు వేరే వాహనంలో ప్రశాంత్‌ను పంపించారు. అయితే.. ప్రశాంత్ తన అభిమానుల మధ్య ర్యాలీ కోసం అద్దె కార్లతో తిరిగి అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నారు. పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ రావొద్దని చెబుతున్నా.. ప్రశాంత్ వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో రెండు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. జూబ్లీహిల్స్ ఎస్సై మెహర్ రాకేశ్ ఫిర్యాదు మేరకు ప్రశాంత్, మనోహర్, వినయ్, అద్దె కార్లను నడిపిన డ్రైవర్లు సాయికిరణ్, రాజుపై కేసు నమోదు చేశారు. ఈనెల 19న డ్రైవర్లు సాయికిరణ్, రాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా ప్రశాంత్, అతని సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ విలేకరులతో మాట్లాడుతూ.. తాను స్వగ్రామంలోనే ఉన్నానని చెప్పారు. తాను సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవాలన్నారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన గొడవకు, తనకెలాంటి సంబంధం లేదని, తప్పు చేసిన వారిని పోలీసులు శిక్షించాలని కోరారు. కాగా బిగ్‌బాస్ షోలో పాల్గొన్న వారి మీద కాకుండా.. కార్యక్రమ నిర్వాహకులపై, హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జునపై పోలీసులు కేసు నమోదు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.