Home » Arrest
బాపట్ల జిల్లాలో ఓ బాలికపై ఐదుగురు సామూహిక అత్యా చారానికి పాల్పడ్డారు. నిందితులను అరెస్ట్ చేశామని రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు.
ఒంటరిగా ఉన్న మహిళలకు డబ్బు ఆశచూపి శారీరక వాంఛ తీర్చుకున్న తర్వాత వారి ప్రాణాలు తీస్తున్న ఓ కరడుగట్టిన హంతకుడిని మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ పోలీసులు పట్టుకున్నారు. సదరు యువకుడు రెండేళ్లలో ఏకంగా ఆరు హత్యలు చేశాడు.
కంచే చేను మేసినట్లు ఉంది ఓ బ్యాంక్ మేనేజర్(Bank Manager) పరిస్థితి. తాను పనిచేస్తున్న బ్యాంక్‌నే మోసం చేసి కోట్లాది రూపాయలను తన సొంత అకౌంట్లోకి బదిలీ చేసుకున్నాడు. ఈ కేసులో నాలుగు నెలల అనంతరం అతడిని బుధవారం ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మూడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
నగరంలో బైక్ రేసర్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. బైక్ రేసింగ్(Bike Racing)కు పాల్పడుతూ నగరవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్న 10మందిని అరెస్టు(Arrest) చేసి రిమాండ్‌కు తరలించారు.
ఫైనాన్షియర్ల ముసుగులో కార్లు, టిప్పర్లు, జేసీబీ వంటి భారీ వాహనాలను మోసపూరితంగా కొనుగోలు చేసి నెదర్లాండ్, దక్షిణాఫ్రికా, కాంబోడియా వంటి దేశాలకు విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారి తెలిపారు.
ఒడిసా నుంచి హైదరాబాద్‌కు గుట్టుగా గంజాయి తరలిస్తున్న రెండు అంతర్రాష్ట ముఠాలకు చెందిన ఆరుగురిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 164 కిలోల గంజాయి, మూడు కార్లు, ఓ బైక్, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
లంచం తీసుకుంటూ సీసీఎస్(CCS) ఇన్స్పెక్టర్ సుధాకర్(Inspector Sudhakar) ఏసీబీ(ACB) అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. రూ.3లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal MLA Rajasingh)కు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్(వీవోఐపీ) ద్వారా ఫోన్లు చేసి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ.. చంపేస్తానని బెదిరింపులకు పాల్పడిన సైబర్ నేరగాడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు(City Cybercrime Police) అరెస్ట్ చేశారు.
గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల కుంభకోణం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టై జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న తెలంగాణ స్టేట్ లైవ్‌స్టాక్ డెవల్‌పమెంట్ ఏజెన్సీ మాజీ సీఈవో రాంచందర్‌తోపాటు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ జి.కల్యాణ్ కుమార్‌ను ఏసీబీ అధికారులు మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు.