Share News

JK Assembly polls 2024: మేనిఫెస్టో విడుదల చేసిన నేషనల్ కాన్ఫరెన్స్

ABN , Publish Date - Aug 19 , 2024 | 06:29 PM

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం శ్రీనగర్‌లో తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆర్టికల్ 370తోపాటు 35ఏని పునరుద్దరిస్తామని ఆయన స్పష్టం చేశారు. వీటితోపాటు మరో 10 అంశాలను మేనిఫెస్టో జాబితాలో పొందు పరిచారు.

JK Assembly polls 2024: మేనిఫెస్టో విడుదల చేసిన నేషనల్ కాన్ఫరెన్స్

శ్రీనగర్, ఆగస్ట్ 19: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఈ అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం శ్రీనగర్‌లో తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆర్టికల్ 370తోపాటు 35ఏని పునరుద్దరిస్తామని ఆయన స్పష్టం చేశారు. వీటితోపాటు మరో 10 అంశాలను మేనిఫెస్టో జాబితాలో పొందు పరిచారు.

Also Read: MUDA scam: సీఎం సిద్దరామయ్యకు తాత్కాలిక ఉపశమనం


ప్రజా భద్రత చట్టాన్ని రద్దు చేస్తామన్నారు. అలాగే రాజకీయ ఖైదీలను విడుదల చేస్తామని తెలిపారు. భారత్, పాక్ మధ్య నిలిచిపోయిన చర్చలను పునరుద్దరిస్తామని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుక బడిన మహిళలకు ఏడాదికి 12 గ్యాస్ సిలెండర్లు అందజేస్తామన్నారు. అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాశ్మీర్ పండిట్లకు పూర్వ వైభవం తీసుకు వస్తామని తెలిపారు.

Also Read: Kolkata College student: సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోస్ట్.. విద్యార్థి అరెస్ట్

Also Read: Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం

Also Read: దారుణం.. రాఖీ కట్టి ఊపిరి వదిలిన అక్క


పాస్‌పోర్టు సౌకర్యాన్ని సులభతరం చేస్తామన్నారు. ఇక జాతీయ రహదారులపై ప్రజలను, వాహనదారులను ఇష్టారీతిలో ఆపడం, తనిఖీలు నిర్వహించడం వంటి ఘటనలు నిరోధిస్తామని చెప్పారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు.

Also Read: రాఖీ పండుగ రోజు ఆకాశంలో అద్భుత.. భారత్‌లో కనిపించనున్న సూపర్‌ మూన్‌

Also Read: MUDA ’scam’: హైకోర్టు తలుపు తట్టిన సీఎం సిద్దరామయ్య


90 స్థానాలున్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి మూడు విడతలుగా... సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటరు ఏ పార్టీకి పట్టం కట్టనున్నాడనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read: TGSRTC: బస్సులో పురుడు పోసిన కండక్టరమ్మ

For Latest News and National News click here

Updated Date - Aug 19 , 2024 | 06:30 PM