Article 370: ఐదో వార్షికోత్సవం.. బీజేపీ ర్యాలీ.. అమర్నాథ్ యాత్ర నిలిపివేత
ABN , Publish Date - Aug 05 , 2024 | 10:53 AM
మోదీ ప్రభుత్వం ‘ఆర్టికల్ 370’ని రద్దు చేసి.. నేటికి అంటే ఆగస్ట్ 5వ తేదీకి అయిదేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో ఆర్ఎస్ పురాలోని బానా సింగ్ స్టేడియంలో ఏకాత్మ మహోత్సవ్ ర్యాలీని బీజేపీ చేపట్టనుంది. సరిగ్గా అయిదేళ్ల క్రితం ఇదే రోజున అంటే.. 2019, ఆగస్ట్ 5వ తేదీన ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
శ్రీనగర్, ఆగస్ట్ 05: మోదీ ప్రభుత్వం ‘ఆర్టికల్ 370’ని రద్దు చేసి.. నేటికి అంటే ఆగస్ట్ 5వ తేదీకి అయిదేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో ఆర్ఎస్ పురాలోని బానా సింగ్ స్టేడియంలో ఏకాత్మ మహోత్సవ ర్యాలీని బీజేపీ చేపట్టనుంది. సరిగ్గా అయిదేళ్ల క్రితం ఇదే రోజున అంటే.. 2019, ఆగస్ట్ 5వ తేదీన ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏకాత్మ మహోత్సవ్ పేరిట ర్యాలీ నిర్వహించాలని బీజేపీ సంకల్పించింది.
మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఫైర్..
మరోవైపు ఈ రోజును ప్రతిపక్షాలు బ్లాక్ డేగా అభివర్ణించాయి. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు చేయడంతో మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్న సంగతి అందరికి తెలిసిందే. అంతేకాదు.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు సైతం స్పందిస్తున్నారు. ఈ ఆర్టికల్ రద్దు చేసిన ఈ అయిదేళ్లలో ఏం సాధించారని బీజేపీని జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రవీంద్ర శర్మ ప్రశ్నించారు. అందుకు సంబంధించి.. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీపై ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజలకు తగిలిన గాయాలపై కారం జల్లుతుందంటూ బీజేపీపై మండిపడ్డారు. ఆర్టికల్ రద్దు చేసి.. నేడు వేడుకలు జరపడం సిగ్గు చేటంటూ బీజేపీకి చురకలంటించారు. ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా మహారాజా హరిసింగ్ పార్క్ వద్ద ఈ రోజు ఆందోళన నిర్వహిస్తామని డెమెక్రటిక్ ప్రొగసీవ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) ప్రతినిధి పేర్కొన్నారు.
Also Read: Wayanad Landslides: నాలుగు మృతదేహాలే దొరికాయంటూ మన్సూర్ ఆవేదన
ఈ రోజు అమర్నాథ్ యాత్రకు విరామం..
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో అధికార బీజేపీ వేడుకలు నిర్వహించేందుకు సిద్దమైంది. మరోవైపు ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విరామం ప్రకటించింది. దీంతో అమర్నాథ్ యాత్రికులు భగవత్ క్యాంప్‌లో ఉండిపోయారు. ఇంకోవైపు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం పట్టిష్టమైన భద్రత చర్యలు చేపట్టింది.
Also Read: Gold Rates Today: శ్రావణమాసం వచ్చేసింది.. ఇక బంగారానికి ఫుల్ డిమాండ్
రెండోసారి అధికారం చేపట్టిన కొద్ది రోజులకే..
2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ వరుసగా రెండో సారి అధికారాన్ని చేపట్టారు. ఆ కొద్ది రోజులకే ఆయన జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలున్న ఆర్టికల్ 370ని రద్దు చేశారు. దాంతో ఆ ఆర్టికల్ రద్దు అయి నేటికి అయిదేళ్లు పూర్తి అయింది.
అసెంబ్లీ ఎన్నికలకు సీఈసీ సన్నాహాకాలు..
మరోవైపు జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాకాలు చేస్తుంది. అందులోభాగంగా ఆగస్ట్ 8వ తేదీ నుంచి ఆగస్ట్ 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం ఆ రాష్ట్రంలో పర్యటించనుంది. అనంతరం కొద్దిరోజులకే అసెంబ్లీ ఎన్నికల నగారాను మోగించనున్నదని తెలుస్తుంది. ఇంకోవైపు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్ ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. అయితే ఆర్టికల్ 370 రద్దు అనంతరం తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆసక్తిని కనబరుస్తున్నారు.
Read More National News and Latest Telugu News