Home » Ashok Gehlot
రానున్న లోక్ సభ ఎన్నికల (2024 Lok Sabha elections) కోసం కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయేనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. చర్చలు, సమాలోచనల తర్వాత 26 పార్టీల ఇండియా (I.N.D.I.A) కూటమి ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
రాజస్థాన్ ప్రభుత్వ అవినీతి, తప్పిదాలకు సంబంధించిన వివిరాలు ఉన్న ''రెడ్ డెయిరీ" విషయంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా డిమాండ్ చేశారు. ఎరుపు పేరు వింటేనే సీఎం బెంబేలెత్తిపోతున్నారని అన్నారు.
సీఎం సీటు విషయంలో పలుమార్లు తమ మధ్య విభేదాలు తలెత్తినా వాటిని పక్కనపెట్టి తన పార్టీ సహచరుడు సచిన్ పైలట్ కు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా బాసటగా నిలిచాడు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఈ ఇద్దరు ప్రముఖ నేతల మధ్య ఇలాంటి కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, ఎంతటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నా.. మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. మహిళలపై వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారు. శిక్షలు సరిగ్గా అమలుకాని పక్షంలోనే.. కామాంధులు ఇలా చెలరేగిపోతున్నారు.
రాజస్థాన్ శాసన సభ ఎన్నికల రణ రంగంలో శంఖారావాల మోత ప్రారంభమైంది. అధికార పక్షం కాంగ్రెస్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరోపణలు పదును తేలుతున్నాయి. సికర్‌లో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot)పై ఘాటైన విమర్శలు చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ)పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విమర్శలు గుప్పించారు. హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ లో పర్యటించేందుకు ప్రధాని ఎందుకు దూరంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కోసం కర్ణాటక, రాజస్థాన్, ఇతర ప్రాంతాల్లో పర్యటనలు జరిపిన మోదీ మణిపూర్‌కు మాత్రం వెళ్లడం లేదని నిలదీశారు. ఇలాంటి ప్రధానిని చూడటం తనకు ఇదే మొదటిసారని అన్నారు.
రాజస్థాన్‌లో మహిళలపై జరుగుతున్న నేరాలను వేలెత్తి చూపినందుకే రాజేంద్ర సింగ్ గుధాను మంత్రి పదవి నుంచి తొలగించారని బీజేపీ ఆరోపించింది. వాస్తవం మాట్లాడినందుకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ చర్య తీసుకున్నారని మండిపడింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ, ఆ పార్టీ నేత, మంత్రి పదవిని కోల్పోయిన రాజేంద్ర సింగ్‌ను ప్రశంసల్లో ముంచెత్తింది.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. గతకొంత కాలంగా ఎడమొఖం పెడమొఖంగా ఉన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్మ ధ్య దోస్తీ కుదర్చడంలో కాంగ్రెస్ అధిష్టానం సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ చేసిన వ్యాఖ్యలే ఈ పరిణామానికి బలం చేకూర్చుతున్నాయి.
రాజస్థాన్ శాసన సభ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. మరోసారి విజయం సాధించడం కోసం వ్యూహాలను రచించేందుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ అగ్ర నేతలు గురువారం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, యువ నేత సచిన్ పైలట్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు.
రాజస్థాన్ కాంగ్రెస్‌లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య వైరం ఎప్పుడు ముగుస్తుందోనని ఆ పార్టీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.