Home » Asia cup 2023
కాసేపట్లో దాయాదులు భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య మ్యాచ్ జరగనుంది. 2019 వరల్డ్ కప్ తర్వాత ఈ రెండు జట్లు వన్డేలో తొలిసారిగా తలపడుతున్నాయి. ఈ హై ఓల్టేజ్ సమరంలో ఎవరు గెలుస్తారా అని అభిమానులు టెన్షన్ పడుతుండగా ఆటగాళ్లు మాత్రం ఎంతో జాలీగా గడుపుతున్నారు. భారత్, పాకిస్థాన్ క్రికెటర్లు సరదాగా ముచ్చటించుకుంటున్న వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రీలంకలోని క్యాండీలో ఈరోజు ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మ్యాచ్ జరిగే సమయంలోనూ 90 శాతం వర్షం పడొచ్చని వాతావరణ శాఖ నివేదిక ఇచ్చింది. దీంతో అంపైర్లు హై ఓల్టేజ్ మ్యాచ్‌ను రద్దు చేసే అవకాశాలను కొట్టిపారేయలేం.
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. వన్డేల్లో ప్రపంచ నంబర్ వన్‌గా అవతరించేందుకు ఆ జట్టు ఎంతో కష్టపడిందని అభిప్రాయపడ్డాడు. కీలక మ్యాచ్‌కు ముందు ప్రత్యర్థిని పొగడటంపై టీమిండియా అభిమానులు ఫైర్ అవుతున్నారు.
శ్రీలంకలోని క్యాండీ వేదికగా ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. అదే సమయానికి వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాయంత్రం 5:30 గంటల వరకు వర్షం కురిసే అవకాశాలు 90 శాతం ఉన్నట్లు వాతావరణ శాఖ నివేదిక ఇచ్చింది. దీంతో మ్యాచ్ సజావుగా సాగుతుందా లేదా అన్న పరిస్థితులు నెలకొన్నాయి.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో 79 పరుగులు చేస్తే ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. కింగ్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసినప్పుడు ఇప్పటివరకు 13,921 పరుగులు చేశాడు.
శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. నిర్ణీత 50 ఓవర్లు కూడా ఆడకుండా బంగ్లా పులులు తోక ముడిచారు. శ్రీలంక బౌలర్లు విజృంభించడంతో 42.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రోహిత్‌కు జతగా ఓపెనింగ్‌లో ఎవరు ఆడబోతున్నారనే దానిపై సందిగ్ధం నెలకొంది.
బుధవారం నాడు ఆసియా కప్‌లో ప్రారంభ మ్యాచ్ చప్పగా ముగిసింది. ఆతిథ్య పాకిస్థాన్, నేపాల్ మధ్య 30 వేల సామర్థ్యం ఉన్న ముల్తాన్ స్టేడియంలో జరిగింది. అయితే 3వేల మంది కూడా లేకపోవడంతో ముల్తాన్ స్టేడియం అంతా బోసిపోయింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ మ్యాచ్‌ను ఉచితంగా స్ట్రీమింగ్ చేయగా.. ఏ దశలోనూ వ్యూయర్‌షిప్ సంఖ్య 15 లక్షలు దాటలేదు.
ముల్తాన్ వేదికగా నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (151), ఇఫ్తికార్ అహ్మద్ (109 నాటౌట్) సెంచరీలు బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్థాన్ ఆరు వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది.
బంగ్లాదేశ్ జట్టుకు తమీమ్ ఇక్బాల్ రిటైర్మెంట్ కారణంగా దూరమయ్యాడు. ఇప్పుడు వైరల్ ఫీవర్ కారణంగా లిట్టన్ దాస్ కూడా లేకపోవడంతో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలహీనంగా కనిపిస్తోంది.