Home » Assembly elections
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 155 నుంచి 160 సీట్లలో పోటీ చేయనుంది. ఏక్నాథ్ షిండే శివసేన 75 నుంచి 80 సీట్లలోనూ, అజిత్ పవార్ ఎన్సీపీ 50 నుంచి 55 స్థానాల్లోనూ పోటీలోకి దిగనున్నాయి.
జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఇండియా' కూటమి కలిసికట్టుగా పోటీ చేస్తుందని జేఎంఎం అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారంనాడు ప్రకటించారు.
ఎన్డీయేకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడదామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, ఎన్సీపీ-ఎస్పీ చీఫ్ శరద్ పవార్కు తమ పార్టీ లేఖ రాసినట్టు ఒవైసీ తెలిపారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లేనని అన్నారు.
జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీయేకు ఊహించని దెబ్బ తగిలింది. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న ఆల్ జార్ఖాండ్ స్టూడెంట్స్ యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షుడు ఉమాకాంత్ రజక్, బీజేపీ హ్రాట్రిక్ ఎమ్మెల్యే కేదార్ హజ్రాలు జార్ఖాండ్ ముక్తి మోర్చాలో చేరారు.
దేశ రాజధాని ఢిల్లీతోపాటు, పంజాబ్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరణ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
అధికార మహాయుతి ముందుగా సీఎం అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు రావాలంటూ ఎంవీఏ సవాలు విసిరిన నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తొలిసారి స్పందించారు.
మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను మంగళవారంనాడు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం, ఇదే సమయంలో 48 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటరీ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్ను కూడా విడుదల చేసింది.
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఇందుకు సంబంధించి ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు కల్పించింది.
ఉత్తరప్రదేశ్ లోని 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల తేదీని ఎన్నికల కమిషన్ మంగళవారంనాడు ప్రకటించింది. నవంబర్ 13న పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 23న ఫలితాలు ప్రకటిస్తారు.
మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను మంగళవారంనాడు ప్రకటించిన ఎన్నికల కమిషన్ ఇదే సమయంలో పంజాబ్ లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల తేదీని ప్రకటించింది.