Sharad Pawar: పదవి కోసం కుటుంబాన్ని చీల్చావు.. అజిత్‌పై సీనియర్ పవార్ నిప్పులు
ABN , Publish Date - Oct 29 , 2024 | 08:05 PM
బారామతి నుంచే పోటీ చేస్తున్న అజిత్ పవార్ సోమవారంనాడు నామినేషన్ అనంతరం కుటుంబంలో విభేదాలు తలెత్తకుండా సీనియర్లు వ్యవహరించాలంటూ శరద్ పవార్‌ను తప్పుపట్టారు. దీనిపై శరద్ పవార్ ఎన్నికల ప్రచారంలో ఘాటుగా స్పందించారు. కుటుంబం విచ్ఛిన్నం చేయడాన్ని తన తల్లిదండ్రులు, సోదరులు ఎన్నడూ నేర్చించ లేదన్నారు.
బారామతి: ఎన్‌సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar)పై నిప్పులు చెరిగారు. పదవి కోసం కుటుంబాన్ని చీల్చిందెవరు? అని నిలదీశారు. తాను స్థాపించిన ఎన్సీపీ గుర్తును తనకు కాకుండా కోర్టుకు లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. బారామతి నియోజకవర్గంలోని ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి యుగేంద్ర పవార్ తరఫున శరద్ పవార్ మంగళవారంనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Ajit Pawar: కుటుంబంలో శరద్ పవార్ చిచ్చుపెట్టారు.. అజిత్ పవార్ భావోద్వేగం
బారామతి నుంచే పోటీ చేస్తున్న అజిత్ పవార్ సోమవారంనాడు నామినేషన్ అనంతరం కుటుంబంలో విభేదాలు తలెత్తకుండా సీనియర్లు వ్యవహరించాలంటూ శరద్ పవార్‌ను తప్పుపట్టారు. దీనిపై శరద్ పవార్ ఎన్నికల ప్రచారంలో ఘాటుగా స్పందించారు. కుటుంబం విచ్ఛిన్నం చేయడాన్ని తన తల్లిదండ్రులు, సోదరులు ఎన్నడూ నేర్చించ లేదన్నారు. అనంతరావు పవార్ (అజిత్ తండ్రి) సహా తమ సోదరులంతా తనతోనే కలిసి నివసించారని అన్నారు. చాలాకాలం క్రితమే మహారాష్ట్రను ముందుకు నడిపించే బాధ్యత ప్రజలు తనకు అప్పగించారని, ప్రస్తుతం తాను మర్గదర్శకుడిగా మాత్రమే ఉంటూ కొత్త తరానికి పార్టీ వ్యవహారాలు అప్పగించానని తెలిపారు. తాము అధికారంలో లేనప్పుడు సొంత కుటుంబ సభ్యులు మమ్మల్ని వదిలి వెళ్లారని, కేవల పదవీ కాంక్షతో కుటుంబాన్ని ముక్కలు చేయడం సరికాదని అజిత్ పవార్‌కు హితవు పలికారు.
''ఆయన (అజిత్) డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి కోసం ఇతరులతో చేతులు కలిపారు. అప్పటికే నాలుగు సార్లు పదవిలో ఉండి ఒక్కసారి పదవి లేనంత మాతాన్ని కుటుంబాన్ని చీలుస్తారా?'' అని శరద్ పవార్ ప్రశ్నించారు. ఇప్పుడు నేనోదో కుటుంబాన్ని విచ్ఛనం చేశానని ఆయన (అజిత్) మాట్లాడుతుండటం వినడానికి కూడా విడ్డూరంగా ఉందన్నారు. ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా తాను వ్యతిరేకించనని, నా కుటుంబం ఎప్పుడూ ఐక్యంగా ఉండాలనే తాను కోరుకుంటానని పవార్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
కేరళలో భారీ బాణాసంచా ప్రమాదం... ఏకంగా 150 మందికి పైగా గాయాలు
ఉగ్రవాదుల చేతుల్లో ఆర్మీ శునకం ఫాంటమ్ మృతి.. ఎలా జరిగిందంటే
Read More National News and Latest Telugu News