Share News

DMK: టార్గెట్ @ 200 నియోజకవర్గాలు..

ABN , Publish Date - Oct 29 , 2024 | 11:48 AM

రానున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకే(DMK) కూటమి 200 నియోజకవర్గాల్లో ఘనవిజయం సాధించాలని, అదే తమ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) పిలుపునిచ్చారు. తేనాంపేట డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయం కలైంజర్‌ అరంగంలో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీల సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే దిశగా డీఎంకే సన్నాహాలను చేపడుతోంది.

DMK: టార్గెట్ @ 200 నియోజకవర్గాలు..

- అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే మనలక్ష్యం

- డీఎంకే పరిశీలకుల సమావేశంలో సీఎం స్టాలిన్‌

చెన్నై: రానున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకే(DMK) కూటమి 200 నియోజకవర్గాల్లో ఘనవిజయం సాధించాలని, అదే తమ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) పిలుపునిచ్చారు. తేనాంపేట డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయం కలైంజర్‌ అరంగంలో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీల సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే దిశగా డీఎంకే సన్నాహాలను చేపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల పనులను నిర్వర్తించేందుకుగాను 234 నియోజకవర్గాలకు పార్టీ తరఫున పరిశీలకులను ఇటీవలే స్టాలిన్‌ నియమించారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: మాజీ సీఎం మిత్రుడికి ఐటీ షాక్‌.. రూ.42 కోట్ల నగదు స్వాధీనం


వీరంతా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ జిల్లా నేతలను కలుసుకుని, సమావేశాలల్లో పాల్గొని పార్టీ విజయానికి అనువైన వ్యూహరచన చేస్తున్నారు. ఎమ్మెల్యేలు నిర్వహించే సభల్లోనూ ఈ ఇన్‌ఛార్జీలు పాల్గొని ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి ఉన్న పలుకుబడి, ప్రజాదరణ తదితర విషయాలను సేకరించి పార్టీ అధిష్టానానికి నివేదిక సమర్పిస్తున్నారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గం ఇన్‌ఛార్జులు ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు తదితర పనులు కూడా చేపడుతున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో పోటీకి ఆసక్తి కనబరిచే అభ్యర్థులకు ఉన్న ప్రజాదరణ, అంగ బలం, ఆర్థిక బలం తదితర విషయాలను కూడా సేకరించి అధిష్టానానికి పంపుతున్నారు.


గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇదేవిధంగా నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పరిశీలకులను డీఎంకే అధిష్టానం నియమించింది. ప్రస్తుతం ఆ పరిశీలకుల్లో 60 శాతం మందిని తొలగించి పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం, మహిళా విభాగం, న్యాయవాదుల విభాగం తదితర పార్టీ విభాగాలకు చెందిన ప్రతినిధులను శాసనసభ నియోజకవర్గాల పరిశీలకులుగా నియమించారు. వీరికి అవసరమైన సలహాలు, సూచనలు తెలియజేసేందుకుగాను సోమవారం ఉదయం అరివాలయంలోని కలైంజర్‌ అరంగంలో ఓ సమావేశం ఏర్పాటు చేశారు.


డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ప్రధానకార్యదర్శి దురైమురుగన్‌, కోశాధికారి టీఆర్‌బాలు, ముఖ్య కార్యదర్శి కేఎన్‌ నెహ్రూ, వ్యవస్థాప కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి, ఎంపీ కనిమొళి, మంత్రి పొన్ముడి, టీకేఎస్‌ ఇలంగోవన్‌, పార్టీ ప్రధాన కార్యాలయం కార్యదర్శి పూచ్చి మురుగన్‌, నియోజకవర్గాల పరిశీలకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్టాలిన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో డీఎంకే కూటమి పటిష్టంగా ఉందని, 200 నియోజకవర్గాల్లో డీఎంకే కూటమిని గెలిపించేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.


ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలతో ఉన్న కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేసి ప్రచారం చేయాలన్నారు. ఇప్పటి నుండే నియోజకవర్గమంతటా పరిశీలకులు, ఆయా జిల్లాల కార్యదర్శులను కలుసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. నియోజకవర్గ పరిశీలకులు దేని గురించి దిగులు పడకుండా పార్టీ విజయం కోసం పాటుపడాలని, తక్కిన విషయాలన్నింటినీ పార్టీ చూసుకుంటుందని స్టాలిన్‌ భరోసా ఇచ్చారు. ఇక బూత్‌ ఏజెంట్లు, బూత్‌ ఇన్‌ఛార్జీలు కూడా ఇప్పటి నుండే కూటమి గెలుపుపె దృష్టిసారించాలన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Food Poisoning: వామ్మో.. మోమోస్‌!

ఈవార్తను కూడా చదవండి: KTR: బుచ్చమ్మది.. రేవంత్‌ చేసిన హత్య

ఈవార్తను కూడా చదవండి: Madhuranagar: ‘ధరణి’తో మా ప్లాట్ల కబ్జా

ఈవార్తను కూడా చదవండి: Kaleshwaram Project: మేడిగడ్డతో ముంపు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 29 , 2024 | 11:48 AM