Home » August 15
దేశ ప్రజలు ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్న రాహుల్ గాంధీని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వెనుక వరుసలో కూర్చోబెడతారా? అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రోజు ముఖ్యమంత్రి నివాసంలో జాతీయ జెండా ఎగురవేయలేదన్నారు. ఇది చాలా విచారకరమని పేర్కొన్నారు. ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని ఈ నియంతృత్వం.. జైల్లో అయితే ఉంచగలిగింది. కానీ హృదయంలో దేశభక్తిని అది ఎలా కలిగి ఉంటుందన్నారు. ఈ మేరకు ఎక్స్ ఖాతా వేదికగా సునీత కేజ్రీవాల్ స్పందించారు.
ప్రధాని నరేంద్రమోదీ పిలుప ుమేరకు ప్రతి ఇంటిపై జాతాయ జెండా ఎగురవేయాలంటూ చౌళూరు జిల్లా పరిషత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయజెండా చేతబూని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడతూ... బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం పోరాటంలో భాగంగా హిందూపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఇప్పటి కర్ణాటక రాష్ట్రంలోని విదురాశ్వత్థంలో స్వాతంత్ర సమరయోదులు సమా వేశం నిర్వహించారన్నారు.
ఎల్లుండి నుండి వంద అన్న క్యాంటీన్లలో ఆహారం సిద్దంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం గుంటూరులోని చుట్టగుంటలో అన్నక్యాంటీన్ ఏర్పాటు పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం అందుకు సంబంధించిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
దేశం యావత్తు ఆగస్టు 15న దేశభక్తితో పులకరిస్తుంది. అయితే భారతదేశం మాత్రమే కాదు.. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్రం పొందిన ఇతర దేశాలు కూడా ఉన్నాయి.
న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆప్ నేత, హోం మంత్రి కైలాశ్ గెహ్లాట్ పాల్గొనాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సెనా ఆదేశించారు. దీంతో చాత్రశాల్ స్టేడియంలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కైలాశ్ గెహ్లాట్ పాల్గొని.. కేజ్రీవాల్ ప్రభుత్వం తరఫున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఈ మేరకు రాజ్ నివాస్ మంగవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
పంద్రాగస్టు వేడుకల్లో వెయ్యి మంది కళాకారుల ప్రదర్శనలుంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
దేశ రాజధానిలో ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు.
ఇప్పటి వరకు వరుసగా 11 సార్లు ఎర్రకోటపై నుంచి ప్రసంగించిన ప్రధానుల్లో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ఉన్నారు. గురువారం జరగనున్న భారత స్వాతంత్ర్య వేడుకలకు దేశ రాజధానిలోని ఎర్రకోట ముస్తాబవుతుంది. ఆ రోజు ప్రధాని నరేంద్ర మోదీ.. ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో వారి సరసన ప్రధానిగా మోదీ చేరనున్నారు.
అమరావతి: పేదలకు కడుపునిండా రుచిగా.. శుచిగా తక్కువ ధరకు భోజనం పెట్టి కడుపు నింపే అన్న క్యాంటిన్లు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 15వ తేదీన రాష్ట్రంలోని వివిధ ప్రాంతంలో మొత్తం వంద క్యాంటీన్లను ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ఇప్పటికే ఏర్పాట్లు చక చక జరిగిపోతున్నాయి. హరే రామ.. హరే కృష్ణ సంస్థ భోజనం అందించే ఏర్పాట్లను చేస్తోంది.