Home » Ayodhya Ram mandir
అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమవుతోంది. ఈ నెల 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది. అదే రోజు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరగనుంది.
అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. వేలాది మంది అతిథులు హాజరవనున్నారు. అయోధ్య ఆలయం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
అయోధ్యలో రామ్ లల్లా (బాలరాముడి) ప్రాణ ప్రతిష్ఠ సోమవారం రోజున జరగనుంది. రామ్ లల్లాకు బహుమతిగా వివిధ ప్రాంతాల నుంచి జ్ఞాపికలు వస్తున్నాయి. బాలరాముడి కోసం 1265 కిలోల లడ్డు ప్రసాదం అయోధ్యకు చేరింది.
అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఈ నెల 22న పుదుచ్చేరికి సెలవు ప్రకటిస్తూ సీఎం ఎన్.రంగస్వామి(CM N. Rangaswamy) ఉత్తర్వులు జారీ చేశారు.
అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠాపన ముహూర్తం ముంచుకొస్తున్న వేళ రామయ్యకు కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 22న జరగబోయే వేడుకకు కనౌజ్ నుంచి వివిధ రకాల అత్తరులు, అమరావతి నుంచి 500 కిలోల కుంకుమ, ఢిల్లీ నుంచి రామాలయాల్లో సేకరించిన ధాన్యం అయోధ్యకు చేరుకున్నాయి.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.500 నోటుపై రాముడి ఫొటోను ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, యూరప్‌లోని కొన్ని దేశాలు కరెన్సీపై హిందు దేవతల ఫొటోలు ఉన్నాయని గుర్తుచేశారు.
అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠకు మూడు రోజులు ముందే బాల రాముడి విగ్రహం తొలి చిత్రం శుక్రవారం వెలుగు చూసింది. కృష్ణశిలపై చెక్కిన రాముడి విగ్రహం ముగ్ధమనోహరంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహంలో శ్రీరాముడు పద్మపీఠంపై చిరునవ్వులు చిందిస్తూ, చేతిలో బంగారు
అయోధ్యలో రామ మందిర్ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జనవరి 22న జరగనుంది. ఈ క్రమంలో తాజాగా సెంట్రల్ బ్యాంక్ నియంత్రణలో ఉన్న మనీ మార్కెట్ల ట్రేడింగ్ వేళలను మార్చుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌లో ఎలాగైతే అయోధ్య నగరం ఉందో.. అలాగే థాయ్‌లాండ్‌లోనూ ‘అయుత్తయ’ పేరుతో ఓ అయోధ్య ఉంది. భౌగోళికంగా ఈ రెండు పట్టణాలు 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. అక్కడ కూడా రామనామం వినిపిస్తుంది. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్నారన్న విషయం తెలిసి.. అయుత్తయ నుంచి మట్టి పంపించారు.
అయోధ్య ( Ayodhya ) లో ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్‌లల్లా (బాల రాముడు) విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీరామజన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది.