Home » Ayodhya Ram mandir
దశాబ్దాలపాటు ఎటూ తేలని వివాదానికి ఒక్క తీర్పుతో పరిష్కారం చూపిన అప్పటి న్యాయమూర్తులకు రామ జన్మ భూమి నుంచి ఆహ్వానం అందింది. ఏళ్లుగా నానుతూ వచ్చిన అయోధ్య రామ మందిరం - బాబ్రీ మసీదు కేసులో నవంబర్ 9, 2019న అయిదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం చారిత్రక తీర్పునిచ్చింది.
Lord Ram in Ayodhya Ram Mandir: భారత ప్రజలే కాకుండా.. యావత్ ప్రపంచంలోని హిందూ సమాజం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. మరో నాలుగు రోజుల్లో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగనుంది. ఇందులో భాగంగా రామాలయం గర్భగుడిలో బాల రాముడి ప్రతిమను ప్రతిష్ఠించారు ఆలయ నిర్వాహకులు.
Telangana: అయోధ్యను విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. భారత జాతికి ప్రతిపక్ష పార్టీలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అయోధ్య రామ్ లల్లా ప్రాణ(Ayodhya Ram Mandir) ప్రతిష్ఠాపన తేదీ సమీపిస్తున్న వేళ.. అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందుకోసం ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అయోధ్య ఆలయ అధికారులకు ఈ మధ్యే ఓ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అయోధ్య మొత్తాన్ని భద్రతావలయంలోకి తీసుకొచ్చారు.
అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సమయం దగ్గర పడింది. ఈ సందర్భంగా జనవరి 22న అయోధ్యలో అన్ని బ్యాంకులు హాఫ్ డే మాత్రమే పనిచేస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు.
అయోధ్యలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమం కనుల పండువగా జరిగింది. ప్రతిష్ఠాపన సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలరాముడికి సంబంధించిన కొత్త ఫొటోలను ఆలయ అధికారులు విడుదల చేశారు.
అయోధ్య రామమందిరంలో రామలల్లా విగ్రహ ప్రతిష్ఠాపన వేళ దేశవ్యాప్తంగా భక్తిపారవశ్యం వి భిన్న రూపాలలో సాగుతోంది.
అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి రామ్ లల్లా (బాలరాముడు) ప్రవేశించారు. రామ్ లల్లా ఐదేళ్ల బాలుడిగా దర్శనం ఇస్తారు. ఆ విగ్రహం ఎలా ఉండనుందో అనే సందేహాం ప్రతి ఒక్కరిలో నెలకొంది. బాల రాముడి విగ్రహ ఫొటోను ఓ జాతీయ వార్తా సంస్థ విడుదల చేసింది.
అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. రైల్వేశాఖ స్పెషల్ ట్రైన్స్ నడిపిస్తోంది. వరంగల్, కాజీపేట నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్స్ వేశారు.