Home » Balka Suman
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ఛాలా ధైర్యంగా ఉన్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం నాడు ఆయన తీహార్ జైల్లో కవితను ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై లిక్కర్ స్కామ్ కేసు పెట్టారని ఆరోపించారు.
అంబేడ్కర్‌ను రేవంత్ ప్రభుత్వం అవమానించిందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ (Balka Suman) అన్నారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... సచివాలయం దగ్గరున్న అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలమాల కూడా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కి ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.
రైతులందరికీ రైతు బంధు డబ్బులు ఇప్పటికీ రాలేదని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ (Balkasuman) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణఏ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైతు బంధు కోసం గత ప్రభుత్వం ఖజానాలో ఉంచిన నగదును సీఎం రేవంత్‌రెడ్డి మింగేశారని ఆరోపించారు. రైతు బంధు నిధులు కొన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి, ఇంకొన్ని ఢిల్లీకి కప్పం కట్టారని విమర్శించారు.
టెట్ -2024 పరీక్ష ఫీజులను విద్యాశాఖ భారీగా పెంచిందని బీఆర్ఎస్ సీనియర్ నేత బాల్కసుమన్(Balka Suman) అన్నారు. శనివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కి బాల్కసుమన్ లేఖ రాశారు. టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఒక పేపర్ రాస్తే రూ.200ల ఫీజు, రెండు రాసిన వారికి 300 రూపాయల ఫీజు మాత్రమే ఉండేదని తెలిపారు. త్వరలో జరుగబోయే టెట్ పరీక్ష ఫీజుకి సంబంధించి ఒక పేపర్‌కు రూ. 1000, రెండు పేపర్లకు రూ. 2000లకు పెంచడం సరికాదని అన్నారు.
Telangana: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమాన్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రెడ్డి నాయకుల దగ్గర ఒక ఎస్సీ బిడ్డను క్రింద కూర్చో బెట్టారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సతీమణినిపైన కూర్చోబెట్టి బీసీ బిడ్డ అయిన కొండా సురేఖను క్రింద కూర్చోబెట్టారన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) లోక్ సభ ఎన్నికల తరువాత బీజేపీలోకి వెళ్తారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని పెద్దన్న అన్నప్పుడే ఈ విషయంపై స్పష్టత వచ్చిందని ఆరోపించారు.
లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో.. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
గురుకుల విద్యార్థుల ఆత్మహత్యల ఘటనపై బీఆర్ఎస్ లీడర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. రేవంత్ ప్రభుత్వం కారణంగానే గడిచిన 15 రోజుల్లో నలుగురు గురుకుల విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్(Balka Suman) మరోసారి నోరుపారేసుకున్నారు. ముఖ్యమంత్రికి చెప్పు చూపించడంపై సుమన్‌కు తెలంగాణ పోలీసులు నోటీసులు పంపించారు. ఈ నోటిసులపై సుమన్ స్పందించారు.
మంచిర్యాల: మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇటీవల బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాల్క సుమన్‌కు నోటీసులు జారీ చేస్తూ.. విచారణకు రావాలని ఆదేశించారు.