Home » Bandi Sanjay
డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టింది ఆర్థిక బడ్జెట్టా? లేక అప్పుల పత్రమా? స్పష్టం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.
తెలుగు రాష్ట్రాలలో ప్రతిష్టాత్మక సాంస్కృతిక, సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాల వేదికగా దశాబ్దాల ఖ్యాతిగాంచిన త్యాగరాయ గాన సభ.. కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు అభినందలు తెలియజేస్తూ మహోజ్వలమైన మూడు వందల ముప్పై పేజీల ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ ఇరవై ఐదవ ప్రచురణతో వచ్చేవారం మంగళాశాసనాలు సమర్పిస్తోంది. భారతీయ జనతాపార్టీ మహిళామోర్చా, ఆరెస్సెస్ మహిళా సేవికా సమితిలకు ఈ గ్రంధం వందల సంఖ్యలో పంచనుంది. ఇప్పటికే సుమారు యాభై పై చిలుకుగా అపురూప ధార్మిక గ్రంధాలను కధలుగా, స్తోత్రాలుగా, వ్యాఖ్యానాలుగా తెలుగులోగిళ్ళకు అందించిన జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం ప్రచురిస్తున్న ఈ గ్రంధాన్ని తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ ప్రోత్సాహంతో గానసభ అధ్యక్షులు జనార్ధనమూర్తి సౌజన్యంతో అందుతోంది. ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ అందించిన శ్రీవిద్యల రచనా సంకలనమే ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్’.
అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ హామీలను పూర్తిగా విస్మరించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై (Pawan Kalyan) టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) సంచలన విమర్శలు చేశారు. రైతులకు నష్టం జరుగుతుందని సినిమా తీసిన చిరంజీవి ఢిల్లీలో ధర్నా చేసిన అన్నదాతలకు ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)కు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) బహిరంగ లేఖ రాశారు. కేంద్ర క్యాబినేట్లో స్థానం దక్కించుకున్నందుకు ముందుగా బండి సంజయ్‌కు పొన్నం శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం నిధులు కేటాయించేలా చూడాలని లేఖలో కోరారు.
మాజీ మంత్రి హరీష్‌రావుపై (Harish Rao) కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు మంచి నాయకుడని, ఆయన ప్రజల మనిషి అని కొనియాడారు.
రాష్ట్రంలో నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని సీఎం రేవంత్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని నడిరోడ్డుపై అవహేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Telangana: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ చేరికలకు సంబంధించి కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వయంగా కేసీఆర్.. సొంత ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి పంపుతున్నారని అన్నారు.
తిరుమల శ్రీవారిని ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. స్వామివారి దయా బిక్షతో కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగానన్నారు.
ఈడీ, సీబీఐ కేసులున్న నాయకులను బీజేపీలోకి తీసుకునే అవకాశం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఈడీ, సీబీఐ సంస్థల విచారణకు బీజేపీకి సంబంధం లేదని, నరేంద్ర మోదీ సర్కారు అవినీతిపరులను ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పారు.