Home » Bandi Sanjay
ఇవాళ హస్తినకు తెలంగాణ బీజేపీ నేతలు వెళుతున్నారు. ఎంపీలుగా విజయం సాధించిన బండి సంజయ్, డీకే అరుణ, రఘనందనరావు తదితరులు ఢిల్లీకి వెళుతున్న వారిలో ఉన్నారు. రేపు ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరగనుంది. బీజేపీ ఎంపీలు సమావేశానికి హాజరుకానుంది. ఇప్పటికే ఢిల్లీలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో మరింత దయనీయ స్థితికి దిగజారింది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఈసారి లోక్‌సభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది. ఏకంగా ఏడు స్థానాల్లో గులాబీ పార్టీ డిపాజిట్ కోల్పోయింది.
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ధ్వజమెత్తారు. వడ్ల టెండర్లు సహా ప్రతి దాంట్లో కమీషన్లు దండుకోవడమే పనిగా పెట్టుకుందని, తెలంగాణను కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంగా మార్చిందని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చార్మినార్‌ను తొలగించాలని అప్పుడు, ఇప్పుడు తమ పార్టీ పోరాడుతునే ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంగనర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) అన్నారు. రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపం ఉండటం మంచిదని.. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరి అభిప్రాయం తీసుకోవాలని కోరారు.
హైదరాబాద్ అంటేనే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ‘‘చార్మినార్ అంటే హైదరాబాద్ అని కేటీఆర్ అంటున్నారు. అది ఆయనకే పరిమితం. హైదరాబాద్ అంటే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం. ఈ నగరానికి ప్రాచుర్యం కూడా అలాగే వచ్చింది.
ఫోన్ ట్యాపింగ్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ఎందుకు అరెస్ట్ చేయట్లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్షాలపై సైబర్ దాడి జరిగిందని విమర్శించారు.
పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. పౌర సరఫరాల శాఖ రూ.50 వేల కోట్ల అప్పులో కూరుకుపోయిందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా అందాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని తప్పనిసరిగా గెలిపించాల్సిన అవసరం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రె్‌సను గెలిపిస్తే.. కేంద్రం గ్రామ పంచాయతీలకు విడుదల చేసే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించే ప్రమాదం ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణలో బీజేపీ కొత్త శక్తిగా అవతరించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తమ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఖాయమని స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికలు ఉండటం వల్ల కూడా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గిందని చెప్పారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటుకు రూ.వెయ్యి, హాఫ్ బాటిల్ మద్యం పంపిణీ చేస్తుంటే ఎన్నికల సంఘం అధికారులు ఏం చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రశ్నించారు.