Bandi Sanjay: హైదరాబాద్ అంటేనే భాగ్యలక్ష్మి ఆలయం
ABN , Publish Date - May 31 , 2024 | 03:43 AM
హైదరాబాద్ అంటేనే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ‘‘చార్మినార్ అంటే హైదరాబాద్ అని కేటీఆర్ అంటున్నారు. అది ఆయనకే పరిమితం. హైదరాబాద్ అంటే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం. ఈ నగరానికి ప్రాచుర్యం కూడా అలాగే వచ్చింది.
సమస్యల నుంచి దృష్టి మళ్లించడంలో.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే: బండి సంజయ్
హైదరాబాద్/న్యూఢిల్లీ, మే 30 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ అంటేనే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ‘‘చార్మినార్ అంటే హైదరాబాద్ అని కేటీఆర్ అంటున్నారు. అది ఆయనకే పరిమితం. హైదరాబాద్ అంటే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం. ఈ నగరానికి ప్రాచుర్యం కూడా అలాగే వచ్చింది. చార్మినార్ వద్దకు వెళ్లిన కేటీఆర్.. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు ఎందుకు వెళ్లలేదు..?’’ అని సంజయ్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన ఏమైందని.. గేయం మార్పుపై ప్రజాభిప్రాయం ఏదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ధాన్యం సేకరణ, ఎరువులు, విత్తనాల కొరత వంటి కీలక సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒకటే అని సంజయ్ విమర్శించారు.
అధికారంలోకి రాగానే ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఆరు నెలలైనా ఎందుకు ఆ చట్టం తీసుకురాలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫీజుల నియంత్రణకు మార్గదర్శకాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎ్‌సఎస్ ప్రభాకర్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంలో నాయకత్వ మార్పు కోసం పోటీ నెలకొందని, ఆ క్రమంలో హరీశ్ ఫోన్‌నూ కేసీఆర్ ట్యాప్ చేశారని అన్నారు.