Home » Bandi Sanjay
Telangana: ‘‘కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉంది...కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి అందరికీ తెలుసు...నాతో సహా బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించిన, జైల్లో వేసిన తీరును ఎవరూ మర్చిపోలేదు. రేవంత్‌పై నమ్మకం పోయిన రోజు నుంచి కాంగ్రెస్‌తో జరగబోయేది యుద్దమే. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైనా బీజేపీ ధాటికి తట్టుకోలేనంతగా యుద్దం చేస్తాం’’ అంటూ..
కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు, పౌరుషం ఉంటే ITIR మంజూరు చేయించాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ITIR శంకుస్థాపన చేయించి బీజేపీ నేతలు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని జగ్గారెడ్డి అన్నారు.
హైదరాబాద్‌లో నాలుగో నగరాన్ని నిర్మించబోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు.
తెలంగాణలో తమ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ (BL Santosh) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు బీజేపీ కార్యాలయానికి బీఎల్ సంతోష్ వచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ అగ్రనేత సమావేశమయ్యారు.
Telangana: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నారు. కేదార్నాథ్ ప్రాంతంలో అయితే కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కేదార్‌నాథ్‌కు వెళ్లిన అనేక మంది యాత్రికులు వర్షాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అలాగే పలువురు తెలుగు యాత్రికులు కూడా కేదార్నాథ్ వద్ద వరదల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. క్లౌడ్ బరస్ట్, భారీ వర్షాల కారణంగా నడక మార్గం దెబ్బతిన్నది.
దేశంలోని మహిళలు, చిన్నారుల భద్రత కోసం వివిధ పథకాలు, కార్యక్రమాల కింద రూ.13,412 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. బుధవారం రాజ్యసభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
దేశంలో మహిళల భద్రత కోసం వివిధ పథకాలు, కార్యక్రమాల కింద కేంద్ర ప్రభుత్వం రూ.13,412కోట్లు ఖర్చు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లోక్ సభలో వెల్లడించారు. మహిళా భద్రతా పథకాల కింద మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపుల కేసులను నిర్వహించే పరిశోధకులతోపాటు ప్రాసిక్యూటర్ల సామర్థ్యం పెంపొందించేందుకు శిక్షణ ఇచ్చే నిబంధన ఉందా?, ఏయే కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటూ ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ బదులిచ్చారు.
‘‘పాతబస్తీ ఏమైనా ఒవైసీ జాగీరా?’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌పై మండిపడ్డారు.
మజ్లిస్ నేత అక్బరుద్దీన్‌కు దమ్ముంటే కొడంగల్ నుంచి పోటీ చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సవాల్ చేశారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటికో ఇన్చార్జిగా ఉండి ఆయనకు డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిస్తామని చెప్పారు.
బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అలాగే నగరంలోని జరుగుతున్న వివిధ ప్రాంతాల్లో బోనాల పండుగ ఉత్సవాల్లో బండి సంజయ్ పాల్గొననున్నారు.