Share News

Bandi Sanjay: వాటి నుంచి డైవర్ట్ చేయడానికే విగ్రహాల లొల్లి...

ABN , Publish Date - Aug 20 , 2024 | 01:57 PM

Telangana: అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీ స్కీమ్‌ల హామీలపై చర్చను డైవర్ట్ చేయడానికే విగ్రహాల లొల్లిని తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల సవాళ్లు, ప్రతి సవాళ్లు ప్రజల దృష్టి‌ని మళ్ళించడానికే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bandi Sanjay: వాటి నుంచి డైవర్ట్ చేయడానికే విగ్రహాల లొల్లి...
Union Minister Bandi Sanjay

కరీంనగర్, ఆగస్టు 20: అధికార పార్టీ కాంగ్రెస్ (Congress), బీఆర్‌ఎస్ (BRS) పార్టీలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీ స్కీమ్‌ల హామీలపై చర్చను డైవర్ట్ చేయడానికే విగ్రహాల లొల్లిని తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల సవాళ్లు, ప్రతి సవాళ్లు ప్రజల దృష్టి‌ని మళ్ళించడానికే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ’’రైతులు ఆందోళన చెందుతుంటే.. మీకు విగ్రహాల సమస్య వచ్చిందా’’ అని ప్రశ్నించారు. విగ్రహాల సవాళ్ళతో ఏమైనా ఉపయోగం ఉందా అని నిలదీశారు. రైతు రుణమాఫీ ఒక బోగస్ అంటూ విమర్శించారు.ఆరు గ్యారంటీ స్కీమ్‌ల అమలుపై శ్వేత పత్రం విడుదల చేయాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.

CM Revanth Reddy: తాగుబోతులు, దొంగల విగ్రహాలకు సచివాలయం ముందు స్థానం లేదు



విగ్రహాల వార్...

ప్రస్తుతం తెలంగాణలో విగ్రహాల వార్ నడుస్తోంది. విగ్రహాలకు సంబంధించి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ మధ్య పెద్ద యుద్దమే నడుస్తోంది. తాము అధికారంలెకి వస్తే సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. కేటీఆర్ కామెంట్స్‌పై రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ జాగ్రత్త అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా సోమాజీగూడలో రాజీవ్ విగ్రహానికి సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. ‘‘ఎవడికైనా చేతనైతే రాజీవ్ గాంధీ విగ్రహం ముట్టుకోండి. రాజీవ్ విగ్రహాన్ని ముడితే చెప్పు తెగే దాకా కొడుతాం. రాజీవ్ విగ్రహం ఎవరు ముడుతారో, ఎప్పుడు ముడుతారో చెపితే మా జాగ్గారెడ్డిని పంపిస్తాం. తాగుబోతులు, దొంగల విగ్రహాలకు సచివాలయం ముందు స్థానం లేదు. తొందరలోనే రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకుందాం. పండగ వాతావరణంలో రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం. రాజీవ్ విగ్రహాన్ని పెడతామంటే తొలగిస్తామని కొందరు సన్నాసులు అంటున్నారు. అధికారం పోయినా బలుపు తగ్గలేదు. బలుపును తగ్గించే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారు. వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకోవాలని కేటీఆర్ అనుకుంటున్నాడు. వాళ్ల అయ్య పోయేదెప్పుడు? విగ్రహాన్ని పెట్టేదెప్పుడు. ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొన్నారు. తాగుబోతు సన్నాసి విగ్రహం సెక్రటేరియట్ ముందు పెడుతారా?. తెలంగాణను దోచుకున్న దొంగ విగ్రహం పెట్టాలా’’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

Jagadish Reddy: రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏమైనా సంబంధం ఉందా..?


‘‘పొద్దున లేస్తే తాగేవాడి విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు పెడుతారా? నీ అయ్య విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా?. అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నాడు... బిడ్డా.. మీకు అధికారం ఇక కలనే.. ఇక మీరు చింతమడకకే పరిమితం. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారు. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మాది. మా చిత్తశుద్ధిని ఏ సన్నాసి శంకించనవసరం లేదు. విచక్షణ కోల్పోయి అర్థంపర్ధం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తుంది. కలలో కూడా నీకు అధికారం రాదు. పది సంవత్సరాల్లో తెలంగాణ తల్లి విగ్రహం గుర్తు రాలేదా? బీఆర్ఎస్ నాయకులు ఇష్టమున్నట్టు మాట్లాడితే సామాజిక బహిష్కరణ చేస్తాం. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం’’ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

TG Politics: సిద్దిపేట జిల్లా కేంద్రంలో పొలిటికల్ హీట్

Bhatti Vikramarka: రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 20 , 2024 | 02:07 PM