Home » Bangladesh Protests
పొరుగున్న బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. దీంతో ఆ దేశంలో రాజకీయ అస్థిరత నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్‌లో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ - చంబల్ ప్రాంతంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ ప్రాంతం ఆవాల పంటకు సుప్రసిద్దం. ఇక్కడ సాగవుతున్న ఆవాల నుంచి ఆవపిండిని తీసి.. దాని ఎగుమతిపై తీవ్ర ప్రభావం పడింది.
బంగ్లాదేశ్‌లో పరిస్థితులు సద్దుమణగలేదు. ఆందోళనకారులు తమ ఆయుధాలు వీడలేదు. యువత వద్ద ఆయుధాలు, తుపాకులు ఉన్నాయి. కొన్ని వీడియోలు అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. యువత వద్ద ఆయుధాలు, రైఫిల్స్ ఉంచుకోవద్దని తేల్చి చెప్పింది. ఒకవేళ మీ వద్ద ఆయుధాలు ఉంటే ఆగస్ట్ 19వ తేదీ లోపు సమీపంలో గల పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని స్పష్టం చేసింది. లేదంటే ప్రభుత్వం తీసుకునే చర్యలను ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించింది.
బంగ్లాదేశ్‌లో అధికార మార్పునకు అమెరికా కుట్ర పన్నిందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాలో తిరుగుబాటు, అల్లర్ల వెనుక కూడా అగ్రరాజ్యం హస్తం ఉందన్నారు.
బంగ్లాదేశ్‌లో హిందువుల ఆలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడిని నిరసిస్తూ ఢాకా, చట్టగ్రాం నగరాలలో వరుసగా రెండోరోజూ వేలాదిమంది హిందువులు ఆందోళనలు నిర్వహించారు. వారికి సంఘీభావంగా వేలాదిమంది ముస్లింలు, విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొన్నారు.
బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, 65 ఏళ్ల జస్టిస్ ఒబైదుల్ హసన్ తన పదవికి రాజీనామా చేశారు. శనివారం సాయంత్రం దేశాధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్‌తో భేటీ అయిన ఆయన పలు అంశాలపై చర్చించిన తర్వాత తన రాజీనామా పత్రాన్ని ఆయనకు సమర్పించారు.
ఢాకాలోని సుప్రీంకోర్టును ఆందోళనకారులు భారీ సంఖ్యలో చుట్టుముట్టారు. గంట వ్యవధిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికీ రాజీనామా చేయాలని ఒబైదుల్లా హస్సన్‌కు వారు ఆల్టిమేటం జారీ చేశారు. ఓ వేళ రాజీనామా చేయకుంటే.. దేశవ్యాప్తంగా ఉన్న న్యాయమూర్తుల నివాసాలను చుట్టుముడుతామని వారు హెచ్చరించారు.
షేక్ హసీనా రాజీనామా దరిమిలా విచ్చలవిడి హింసాకాండతో బంగ్లాదేశ్‌లో అస్థిరత నెలకొంటే ఈశాన్య భారతం, పశ్చిమ బెంగాల్ తీవ్రంగా ప్రభావితమవుతాయని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ హెచ్చరించారు.
హింసాకాండతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వేలాది బంగ్లాదేశీయులను బీఎ్‌సఎఫ్ బలగాలు సరిహద్దులో అడ్డుకుంటున్నాయి.
బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నాయి. మహ్మద్ యూనాస్ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొలువుదీరింది. ఇంతలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజద్ జాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బంగ్లాదేశ్‌లో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడింది. పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి.
రికార్డుల ప్రకారం బంగ్లాదేశ్‌లో 19 వేల మంది భారతీయులు ఉన్నారన్నారు. వారిలో 9 వేల మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. బంగ్లాదేశ్‌లోని భారతీయ రాయబార కార్యాలయాల సిబ్బంది.. భారతీయులను స్వచ్ఛందంగా స్వదేశానికి పంపుతున్నారని చెప్పారు.