Share News

Unrest In Bangladesh: భారత్‌లో ఆవాల పరిశ్రమకు గట్టి దెబ్బ

ABN , Publish Date - Aug 12 , 2024 | 07:32 PM

పొరుగున్న బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. దీంతో ఆ దేశంలో రాజకీయ అస్థిరత నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్‌లో మధ్యప్రదేశ్‌‌లోని గ్వాలియర్ - చంబల్ ప్రాంతంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ ప్రాంతం ఆవాల పంటకు సుప్రసిద్దం. ఇక్కడ సాగవుతున్న ఆవాల నుంచి ఆవపిండిని తీసి.. దాని ఎగుమతిపై తీవ్ర ప్రభావం పడింది.

Unrest In Bangladesh: భారత్‌లో ఆవాల పరిశ్రమకు గట్టి దెబ్బ

ఏదైన ఓ దేశంలో యుద్దం జరిగితే.. మరో దేశంపై దాని ప్రభావం ఎంతో కొంత పడతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే పొరుగున్న బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. దీంతో ఆ దేశంలో రాజకీయ అస్థిరత నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్‌లో మధ్యప్రదేశ్‌‌లోని గ్వాలియర్ - చంబల్ ప్రాంతంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ ప్రాంతం ఆవాల పంటకు సుప్రసిద్దం. ఇక్కడ సాగవుతున్న ఆవాల నుంచి ఆవపిండిని తీసి.. దాని ఎగుమతిపై తీవ్ర ప్రభావం పడింది.

Also Read: Doctor's Murder Case: సీఎం మమతా బెనర్జీకి ప్రియాంక గాంధీ విజ్ఞప్తి


దీంతో బంగ్లాదేశ్‌కు వేలాది టన్నుల ఆవ పిండి ఎగుమతి కాకుండా నిలిచిపోయాయి. దాంతో రూ.150 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా దాదాపు 2 వేల మంది రైతులకు జీవనోపాధి లేకుండా పోయిందని వారు ఆందోళన చెందుతున్నారు. గ్వాలియర్ - చంబల్ ప్రాంతంలోని మోరినాలో దాదాపు 50కిపైగా ఆవాల మిల్లులున్నాయి. ఆ ఆవపిండిలో 90 శాతం బంగ్లాదేశ్‌కి ఎగుమతి చేస్తారు. ఆ దేశంలోని పౌల్ట్రీ, చేపలు, జంతువుల ఆహార తయారీలో దీనిని వినియోగిస్తారు.

Also Read: Independence Day: వరుసగా 11వ సారి ప్రధానిగా మోదీ..


అయితే బంగ్లాదేశ్‌లో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఈ ఆవపిండిని ఎగుమతి చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో భారీ నష్టం సంభవించిందని రైతులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలోని సంక్, రైయుర్ రైల్వే స్టేషన్ల ద్వారా ప్రతీ రోజు 3,500 టన్నుల ఆవ పిండి ఎగుమతి అవుతుందన్నారు. తద్వారా రైల్వే శాఖకు సైతం భారీగా లాభాలు వస్తాయని చెప్పారు. కానీ జులై నుంచి బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆవపిండి ఎగుమతి నిలిచిపోయిందని చెప్పారు. దీంతో భారీ నష్టం వాటిల్లిందని వారు పేర్కొన్నారు.

Also Read: Kolkata Trainee Doctor Case: ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా


మరోవైపు మధ్యప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ.. ఇప్పటికే 11 ర్యాక్‌లు పంపామన్నారు. మరో 7 ర్యాక్‌లు మాత్రం ఇర్కుపోయాయని చెప్పారు. దీంతో ఈ పరిశ్రమలో వేలాది మంది కార్మికులకు పని లేకుండా పోయిందని చెప్పారు. వారంతా ఇంటికి వెళ్లిపోయారని తెలిపారు. తామ ఒక్క బంగ్లాదేశ్‌కు మాత్రమే ఎగుమతి చేస్తామని స్పష్టం చేశారు. దాంతో ఈ పరిస్థితులు ఏర్పాడ్డాయన్నారు. బంగ్లాదేశ్‌లో సాధారణ స్థితి ఎప్పుడు వస్తుందోనని ఈ సందర్భంగా ఆయన సందేహం వ్యక్తం చేశారు.

Also Read: Pune Airport: నకిలీ విమాన టికెట్లతో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 12 , 2024 | 07:32 PM