• Home » Bangladesh

Bangladesh

Bandi Sanjay: చైనా ఆదేశాలతోనే రాహుల్‌ మౌనం

Bandi Sanjay: చైనా ఆదేశాలతోనే రాహుల్‌ మౌనం

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై రాహుల్‌ గాంధీ నోరు విప్పకపోవడానికి ఆయనకు చైనా నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని, చైనా ఆలోచనలను రాహుల్‌ భారత్‌లో అమలు చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు.

Mohammad Yunus : రాక్షసి పీడ వదిలింది

Mohammad Yunus : రాక్షసి పీడ వదిలింది

బంగ్లాదేశ్‌కు పట్టిన రాక్షసి పీడా వదిలిందని కొన్ని రోజుల క్రితం దేశం వదిలి పారిపోయిన గత ప్రభుత్వాధినేత హసీనాను అభివర్ణిస్తూ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారధి మహమ్మద్‌ యూనుస్‌ అన్నారు.

Unrest In Bangladesh: భారత్‌లో ఆవాల పరిశ్రమకు గట్టి దెబ్బ

Unrest In Bangladesh: భారత్‌లో ఆవాల పరిశ్రమకు గట్టి దెబ్బ

పొరుగున్న బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. దీంతో ఆ దేశంలో రాజకీయ అస్థిరత నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్‌లో మధ్యప్రదేశ్‌‌లోని గ్వాలియర్ - చంబల్ ప్రాంతంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ ప్రాంతం ఆవాల పంటకు సుప్రసిద్దం. ఇక్కడ సాగవుతున్న ఆవాల నుంచి ఆవపిండిని తీసి.. దాని ఎగుమతిపై తీవ్ర ప్రభావం పడింది.

Bangladesh: హిందువులకు కమాపణ చెప్పిన బంగ్లాదేశ్ హోం మంత్రి

Bangladesh: హిందువులకు కమాపణ చెప్పిన బంగ్లాదేశ్ హోం మంత్రి

బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్లు, హింసాకాండలో హిందువులకు తగినంత భద్రత కల్పించలేకపోవడంపై ఆ దేశ హోం మంత్రి షెకావత్ హుస్సేన్ క్షమాపణ చెప్పారు. హిందూ మైనారిటీని రక్షించే బాధ్యత మెజారిటీ ముస్లింలపై ఉందని అన్నారు.

Bangladesh: ఆయుధం ఉంటే అంతే సంగతులు..!!

Bangladesh: ఆయుధం ఉంటే అంతే సంగతులు..!!

బంగ్లాదేశ్‌లో పరిస్థితులు సద్దుమణగలేదు. ఆందోళనకారులు తమ ఆయుధాలు వీడలేదు. యువత వద్ద ఆయుధాలు, తుపాకులు ఉన్నాయి. కొన్ని వీడియోలు అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. యువత వద్ద ఆయుధాలు, రైఫిల్స్ ఉంచుకోవద్దని తేల్చి చెప్పింది. ఒకవేళ మీ వద్ద ఆయుధాలు ఉంటే ఆగస్ట్ 19వ తేదీ లోపు సమీపంలో గల పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని స్పష్టం చేసింది. లేదంటే ప్రభుత్వం తీసుకునే చర్యలను ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించింది.

Ex-PM Sheikh Hasina : బంగ్లాలో అధికార మార్పునకు అమెరికా కుట్ర

Ex-PM Sheikh Hasina : బంగ్లాలో అధికార మార్పునకు అమెరికా కుట్ర

బంగ్లాదేశ్‌లో అధికార మార్పునకు అమెరికా కుట్ర పన్నిందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాలో తిరుగుబాటు, అల్లర్ల వెనుక కూడా అగ్రరాజ్యం హస్తం ఉందన్నారు.

Dhaka : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడికి నిరసన

Dhaka : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడికి నిరసన

బంగ్లాదేశ్‌లో హిందువుల ఆలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడిని నిరసిస్తూ ఢాకా, చట్టగ్రాం నగరాలలో వరుసగా రెండోరోజూ వేలాదిమంది హిందువులు ఆందోళనలు నిర్వహించారు. వారికి సంఘీభావంగా వేలాదిమంది ముస్లింలు, విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొన్నారు.

 Dhaka : బంగ్లా సీజే రాజీనామా

Dhaka : బంగ్లా సీజే రాజీనామా

బంగ్లాదేశ్‌ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, 65 ఏళ్ల జస్టిస్‌ ఒబైదుల్‌ హసన్‌ తన పదవికి రాజీనామా చేశారు. శనివారం సాయంత్రం దేశాధ్యక్షుడు మహమ్మద్‌ షహబుద్దీన్‌తో భేటీ అయిన ఆయన పలు అంశాలపై చర్చించిన తర్వాత తన రాజీనామా పత్రాన్ని ఆయనకు సమర్పించారు.

Bangladesh Violance: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా..!

Bangladesh Violance: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా..!

ఢాకాలోని సుప్రీంకోర్టును ఆందోళనకారులు భారీ సంఖ్యలో చుట్టుముట్టారు. గంట వ్యవధిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికీ రాజీనామా చేయాలని ఒబైదుల్లా హస్సన్‌కు వారు ఆల్టిమేటం జారీ చేశారు. ఓ వేళ రాజీనామా చేయకుంటే.. దేశవ్యాప్తంగా ఉన్న న్యాయమూర్తుల నివాసాలను చుట్టుముడుతామని వారు హెచ్చరించారు.

Mohammad Yunus : బంగ్లాదేశ్‌ అస్థిరపడితే భారత్‌కు ముప్పు!

Mohammad Yunus : బంగ్లాదేశ్‌ అస్థిరపడితే భారత్‌కు ముప్పు!

షేక్‌ హసీనా రాజీనామా దరిమిలా విచ్చలవిడి హింసాకాండతో బంగ్లాదేశ్‌లో అస్థిరత నెలకొంటే ఈశాన్య భారతం, పశ్చిమ బెంగాల్‌ తీవ్రంగా ప్రభావితమవుతాయని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ హెచ్చరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి