Home » Bellampalli
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. వేమనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఆసుపత్రి పరిసరాలను, వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ సేవలు మరువలేనివని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆదివారం గుండ మల్లేష్ వర్ధంతిని నిర్వహించారు. గుండా మల్లేష్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచి ప్రజల సంక్షేమానికి కృషి చేశారన్నారు.
గత ప్రభుత్వ హయాంలో నాలుగేండ్ల క్రితం బెల్లంపల్లికి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ మంజూరైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకే ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ మంజూరు కావడం, బెల్లంపల్లికి కేటాయించడంతో స్ధానికులు, జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని శనివారం సీపీఐ పట్టణ సమితి నాయకులు కాంటా చౌరస్తా వద్ద రహదారిపై ధర్నా నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు వెంకటస్వామి, పట్టణ కార్యదర్శి ఆవిడపు రాజమౌళిలు మాట్లాడుతూ ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లితోపాటు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు.
అటవీ శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. కింది స్థాయి ఉద్యోగులు మొదలుకుని ఉన్నతాధికారుల వరకు కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో అటవీ సంపదకు రక్షణ కరువైంది. అక్ర మార్కుల గొడ్డలి వేటుకు విలువైన అటవీ సంపద తరిగి పోతుంది. దీంతోపాటు వేటగాళ్లు వన్యప్రాణులను హత మారుస్తున్నారు.
జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, దాబాల్లో అపరిశుభ్రత నెలకొంటుంది. రోజుల తరబడి నిల్వ చేసిన ఆహార పదార్ధాలతో వంటకాలు తయారు చేస్తు న్నారు. కుళ్లిన కూరగాయలు, మాంసం, నాణ్యత లేని పదార్ధాలు, కాలం చెల్లిన మసాలాలు వినియోగిస్తున్నారు.
గిరిజన గ్రామాల్లో జ్వరాలు ప్రబలకుండా నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేప ట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కాసిపేట పీహెచ్సీని సందర్శించి వైద్యులు, రోగులకు అం దిస్తున్న సేవలను తెలుసుకున్నారు. జ్వరపీడిత గ్రామాల ను గుర్తించి వైద్య శిబిరాలను నిర్వహించాలని సూచిం చారు.
నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజల రక్షణ కోసం పాటుపడాలని రామగుండం సీపీ శ్రీని వాస్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కుమరంభీం ఆసి ఫాబాద్ జిల్లా జైనూరు మండలానికి చెందిన మహి ళపై అత్యాచారయత్నం, దాడికి పాల్పడిన నిందితుడి పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 21న రాష్ట్ర బంద్కు పిలుపు నిచ్చినట్లు ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల బాపు తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మహాలక్ష్మి పథకం ఎల్పీజీ సబ్సిడీ పత్రాల పంపిణీలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అ ర్హులైన వారికి రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామన్నారు.