Rahul Gandhi: ఈవీఎంలపై రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్.. ఇంతకీ ఏమన్నారంటే..
ABN , Publish Date - Mar 14 , 2024 | 09:25 PM
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న ప్రస్తుత తరుణంలో పార్టీలన్నీ తమ అస్త్రశస్త్రాలను సంధించుకుంటున్నాయి. అభ్యర్థుల ప్రకటనతో ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న ప్రస్తుత తరుణంలో పార్టీలన్నీ తమ అస్త్రశస్త్రాలను సంధించుకుంటున్నాయి. అభ్యర్థుల ప్రకటనతో ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నాయి. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రానప్పటికీ ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. విమర్శలు, ఆరోపణలతో పార్టీ నేతలు వాడి వేడీగా సాగిపోతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) చేసిన కామెంట్లు నేషనల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. మహారాష్ట్రలోని దొండైచాలో జరిగిన ఓ సభలో కేంద్ర ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలకు స్వస్తి చెప్పి వాటి స్థానంలో బ్యాలెట్ విధానం తీసుకురావాలని కోరారు.
ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు, ఇండియా కూటమి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయినా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర చివరి విడతలో మహారాష్ట్ర చేరుకున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈవీఎంల విధానాన్ని మళ్లీ తెరపైకి తీసుకువచ్చారు. ఈవీఎంలను తొలగించాలని రాహుల్ గాంధీ చెబుతున్న 17 సెకన్ల నిడివి గల వీడియోను కాంగ్రెస్ షేర్ చేసింది.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.