Share News

Congress: ముంబయిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. గెలుపే లక్ష్యంగా రాహుల్ ప్రసంగం..

ABN , Publish Date - Mar 17 , 2024 | 11:23 AM

2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2024 జనవరి 14 న మణిపుర్ నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ్ యాత్ర నిన్న (మార్చి 16) ముంబయిలో ముగిసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఇవాళ పాదయాత్ర నిర్వహించారు.

Congress: ముంబయిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ..  గెలుపే లక్ష్యంగా రాహుల్ ప్రసంగం..

2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2024 జనవరి 14 న మణిపుర్ నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ్ యాత్ర నిన్న (మార్చి 16) ముంబయిలో ముగిసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఇవాళ పాదయాత్ర నిర్వహించారు. మహాత్మా గాంధీ నివాసం మణి భవన్ నుంచి ఆగస్టు క్రాంతి మైదాన్ వరకు పాదయాత్ర జరగనుంది. ఒక కిలోమీటర్ దూరానికి న్యాయ సంకల్ప్ పాదయాత్ర అని పేరు పెట్టారు. సామాజిక, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన వ్యక్తులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. పాదయాత్ర అనంతరం రాహుల్ గాంధీ ముఖ్య నిపుణులతో భేటీ అవుతారు.

ఇవాళ సాయంత్రం దాదర్‌లోని శివాజీ పార్క్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, ప్రియాంక గాంధీ, ప్రకాష్ అంబేడ్కర్, తేజస్వీ యాదవ్ సహా ముఖ్య నాయకులందరూ ఈ సభలో పాల్గొంటారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష కూటమి ఇండియా బలం చూపించేందుకు ముఖ్య నేతలు అందరూ విమర్శనాస్త్రాలు సిద్ధం చేసుకున్నారు.


కాగా.. భారత్ జోడో న్యాయ్ యాత్ర 63 రోజుల పాటు కొనసాగింది. 6,600 కిలోమీటర్ల దూరం సాగిన ఈ యాత్ర 15 రాష్ట్రాల గుండా సాగింది. 15 బహిరంగ సభలు నిర్వహించి 70 చోట్ల ప్రజలనుద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. నిన్న జరిగిన న్యాయ యాత్ర ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరయ్యారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 17 , 2024 | 11:23 AM