Home » bharat jodo yatra
కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఒక కుక్కపిల్లకు బిస్కట్లు తినిపిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోను బీజేపీ షేర్ చేస్తూ, ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించాయి. దీనిపై రాహుల్ గాంధీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ''బీజేపీకి కుక్కలు ఏమి హాని చేశాయి? ఇదేనా వారికి కుక్కపిల్లలపై ఉన్న ప్రేమ'' అంటూ రాహుల్ నిలదీశారు.
జార్ఖాండ్‌లో కాంగ్రెస్ ''భారత్ జోడో న్యాయ్ యాత్ర'' కొనసాగుతోంది. యాత్రకు సారథ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ వారితో మమేకమవుతున్నారు. తాజాగా ఆయన బొగ్గు రవాణా కార్మికులతో కలిసి ముచ్చటించారు. వారితో అడుగులో అడుగు వేశారు. సైకిళ్లపై టన్నుల బరువును మోసుకెళ్తున్న కార్మికుల కష్టాన్ని తెలుసుకునేందుకు సైకిల్ నడిపారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ బంగాలోని మాల్దాలో బుధవారం మధ్యాహ్నం ....
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర కాన్వాయ్‌పై ఈరోజు బెంగాల్, బీహార్ సరిహద్దులో దాడి జరిగింది. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ యాత్రకు పదే పదే ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన బిహార్ సీఎం నితీశ్ కుమార్.. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ కూటిమికి షాకిస్తూ వైదొలగిన విషయం తెలిసిందే. ఎన్డీయే సారథ్యంలో బిహార్‌లో ఆయన సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే.. ఇండియా కూటమి నేతలు నితీశ్‌పై తారాస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండు రోజుల విరామం తర్వాత ఈరోజు పునఃప్రారంభం కానుంది. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయిగురి జిల్లా నుంచి తిరిగి ప్రారంభమవుతుంది.
రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' అసోంలో దుమారం రేపుతోంది. రాహుల్ ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలిచ్చిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తాజాగా రాహుల్‌ను అరెస్టు చేసి తీరుతామన్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని పోలీసులను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదేశించారు. అస్సాంలో రాహుల్ గాంధీ అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
దేశంలో అన్యాయ కాలం నడుస్తున్నందునే న్యాయ్ యాత్ర చేపట్టినట్టు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. మణిపూర్‌లోని ధౌబల్‌లో 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'ను రాహుల్ ఆదివారంనాడు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజలను ఏకం చేయడానికే భారత్ న్యాయ్ యాత్ర చేపడుతున్నామని చెప్పారు.
న్యూఢిల్లీ, జనవరి 13: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జనవరి 14వ తేదీ నుంచి భారత్ జోడో న్యా్య్ యాత్ర చేపట్టనున్నారు. మణిపూర్‌లోని తౌబల్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఆదివారం ప్రారంభమయ్యే యాత్ర 15 రాష్ట్రాలు.. 110 జిల్లాలు.. 6,700 కిలోమీటర్లు.. 100 లోక్‌సభ నియోజకవర్గాలు కవర్ చేస్తూ 66 రోజులు కొనసాగనుంది.