Home » Bhatti Vikramarka Mallu
ఉద్యమ సమయంలో సాగరహారం.. మిలియన్ మార్చ్, వంటావార్పులకు వేదికైన ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం తెలంగాణ దశాబ్ది సంబురాలు అంబరాన్నంటాయి. వరణుడు కూడా ముఖ్యఅతిథిగా పాల్గొన్నాడా? అన్నట్లుగా గంటపాటు వాన దంచికొట్టినా.. కళాకారుల నృత్యాలు, పోలీసుల ఫ్లాగ్‌మార్చ్ ఆగలేదు.
మరికాసేపట్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల సంరంభం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రారంభం కానుంది. వేడుకల్లో భాగంగా తెలంగాణ అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. పోలీస్ సిబ్బందికి అవార్డులను అందజేస్తారు. ఆవిర్భావ వేడుకలకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. అనారోగ్య కారణాల వల్ల ఆమె రావడం లేదని తెలుస్తోంది.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రావాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఆహ్వానించారు. గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ సుమారు 30 నిమిషాలపాటు కొనసాగింది.
తెలంగాణలో మళ్లీ చీకట్లు మొదలయ్యాయని, కరెంట్ కోతలు నిత్యకృత్యమయ్యాయని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో విద్యుత్ కోతలు లేవంటూ ఓ వైపు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నప్పటికీ తరచూ విద్యుత్ కోతలు ఉంటున్నాయని శనివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
వానాకాలంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు కలుగకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
‘‘ఈ ఏడాది జూన్ 2కు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ రోజుతో తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ విముక్తి లభించింది. విభజన చట్టం ప్రకారం ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది.
‘‘సమ్మక్క, సారక్క, జంపన్నలను చంపినవారిగానే కాకతీయ రాజులను నేను చూస్తా. పన్నులు చెల్లించబోం అని అన్నందుకు ఆ గిరిజన యోధులపై దాడి చేసి హతమార్చారు. రుద్రమదేవి హయాం వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని రెడ్డి సామంతులు కాపాడారు. ప్రతాపరుద్రుడు వచ్చాక పద్మనాయకులను చేరదీశాడు. వారు చేయివ్వడంతో ఆ సామ్రాజ్యం పతనమైంది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
స్వరాష్ట్ర స్వప్నం సాకారమైన ఉద్విగ్న క్షణాలకు పదేళ్లు. తొలి, మలిదశ ఉద్యమాల్లో ఎన్నో త్యాగాలు, బలిదానాలతో భారతాన అవతరించిన తెలంగాణ రాష్ట్రం అస్తిత్వాన్ని చాటుకుంటూ.. అగ్రపథాన పయనిస్తూ.. దశాబ్ద కాలాన్ని దాటుతోంది. ఆత్మగౌరవ పోరాటం ఫలించిన క్షణాలను గుర్తు చేసుకుంటూ తెలంగాణ దశాబ్ది అవతరణ ఉత్సవాలకు ముస్తాబైంది.
తెలంగాణ 10 ఏళ్ల ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కరాజ్ భవన్ వెళ్లి రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒడిసా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. బుధవారం రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి భువనేశ్వర్‌కు చేరుకుంటారు. గురువారం ఉదయం భువనేశ్వర్ నుంచి రోడ్డు మార్గంలో వెళ్లి భద్రలోక్ లోక్‌సభ నియోజకవర్గంలో రాహుల్‌తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు.