Share News

Hyderabad: విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగొద్దు:భట్టి

ABN , Publish Date - Jun 02 , 2024 | 04:34 AM

వానాకాలంలో విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు కలుగకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

Hyderabad: విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగొద్దు:భట్టి

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలో విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు కలుగకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సయ్యద్‌ అలీ ముర్తుజా రిజ్వీ, సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ సీఎండీ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, ట్రాన్స్‌కో జేఎండీ చెరుకూరి శ్రీనివాసరావు, అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో విద్యుత్‌ లైన్లపై చెట్లు విరిగిపడటం, స్తంభాలు పడిపోవడం, విద్యుత్‌ తీగలు ఊడిపడటంవంటి ఘటనలు జరుగుతుంటాయని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎవరికీ ఇబ్బంది కలుగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. గృహ వినియోగదారులు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తు అందుబాటులో ఉందని, సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడాలని తెలిపారు.

Updated Date - Jun 02 , 2024 | 04:34 AM